Dulquer Salmaan: సీఎం జగన్ బయోపిక్ చేయాలని ఉంది.. నటుడు దుల్కర్ కామెంట్స్ వైరల్?

Dulquer Salmaan: మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమయ్యారు. ఇలా మహానటి సినిమా తర్వాత ఈయన నటించిన తదుపరి చిత్రం సీతారామం. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూలలో పాల్గొని పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయనకు యాంకర్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.ఈయన తండ్రి గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ చిత్రంలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వైయస్ జగన్ బయోపిక్ చిత్రంలో నటించే అవకాశం వస్తే నటిస్తారా అనే ప్రశ్న ఎదురయింది.

ఈ ప్రశ్నకు దుల్కర్ సమాధానం చెబుతూ.. స్క్రిప్ట్ నచ్చితే తప్పకుండా నటిస్తానని అయితే ఏ వయసు నుంచి ఏ వయసు వరకు నటించాలి అనే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని దాన్నిబట్టి మనం నిర్ణయించుకోవాలని తెలిపారు.స్క్రిప్ట్ ఎంతవరకు జనాలను ఆకట్టుకుంటుందనే విషయాలను కనుక గ్రహించగలిగితే తప్పకుండా ఇలాంటి సినిమాలలో నటించవచ్చు అంటూ ఈయన తెలిపారు.

Dulquer Salmaan: ఏపీ రాజకీయాల గురించి అవగాహన లేదు…

ఇకపోతే తనకు ఏపీ పాలిటిక్స్ గురించి పెద్దగా అవగాహన లేదని, కాబట్టి ఎవరి సైడ్ తీసుకోకుండా ఆలోచిస్తానని ఈయన పేర్కొన్నారు. ఇకపోతే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యాత్ర చిత్రం ద్వారా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఈ క్రమంలోనే ఈయనకు సైతం ఈ విధమైనటువంటి ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం జగన్ బయోపిక్ చిత్రం గురించి దుల్కర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.