రూ. 35,000 పెట్టుబడితో లక్షలు సంపాదించే ఛాన్స్.. ఏం బిజినెస్ అంటే..?

మనలో చాలామందికి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్నా రోజురోజుకు పెరిగిపోతున్న ఖర్చుల వల్ల బిజినెస్ విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. అయితే కొన్ని బిజినెస్ ల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలిచ్చే బిజినెస్ లలో రైస్ మిల్ బిజినెస్ ఒకటి. ఈ బిజినెస్ గురించి కనీస అవగాహన ఉంటే లక్షల రూపాయల లాభాన్ని సులువుగా పొందవచ్చు.

ఈ బిజినెస్ ద్వారా తక్కువ సమయంలొనే ఎక్కువ రాబడి సొంతమవుతుంది. కొంత మొత్తం పెట్టుబడి పెడితే మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ స్కీమ్ ల ద్వారా సులభంగా పొందవచ్చు. 1000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న స్థలం ఉంటే సులభంగా రైస్ మిల్లును ఏర్పాటు చేసుకోవచ్చు. రైస్ మిల్లును ఏర్పాటు చేయాలంటే 3 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ప్రాంతాన్ని బట్టి ఈ ఖర్చులో స్వల్పంగా మార్పులు ఉంటాయి. ముద్రా లోన్ ద్వారా రైస్ మిల్లు ఏర్పాటు కోసం సులభంగా లోన్ లభిస్తుంది. కేంద్రం 80 నుంచి 90 శాతాన్ని లోన్ రూపంలో ఇస్తుంది కాబట్టి మీ దగ్గర 30,000 రూపాయల నుంచి 35,000 రూపాయలు ఉన్నా సులువుగా ఈ బిజినెస్ ను ప్రారంభించవచ్చు. ఖర్చుతో పోలిస్తే ఎక్కువ రాబడి ఇచ్చే బిజినెస్ కావడంతో ఈ బిజినెస్ ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది.

మిగతా బిజినెస్ లతో పోల్చి చూస్తే ఈ బిజినెస్ కు ఎక్కువ సంఖ్యలో వర్కర్లు కూడా అవసరం లేదు. తక్కువ సంఖ్యలో తక్కువ పెట్టుబడితో రైస్ మిల్ బిజినెస్ ద్వారా ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో రాణించాలని అనుకునేవారికి రైస్ మిల్ల్ బిజినెస్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.