నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. భారీ వేతనంతో 9,000 ఉద్యోగాల భర్తీ..?

ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఒకటైన ఎర్నెస్ట్ అండ్ యంగ్ సర్వీసెస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 2,021 సంవత్సరంలో 9,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి సిద్ధమైనట్టు కీలక ప్రకటన చేసింది. లాక్ డౌన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి, సాఫ్ట్ వేర్ రంగంపై ఆసక్తి ఉన్న ఫ్రెషర్లకు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ వల్ల ప్రయోజనం చేకూరనుంది. ఈవై సంస్థ నూతన టెక్నాలజీలకు సంబంధించి ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ కోర్సులకు సంబంధించిన ఉద్యోగాలను ఈ సంస్థ భర్తీ చేయనుంది. ఈసీఈ, సీఎస్సీ, ఐటీ బ్రాంచ్ లలో ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు ఈ ఉద్యోగాల భర్తీ వల్ల ప్రయోజనం చేకూరనుంది. ఎంపికైన అభ్యర్థులకు భారీ మొత్తంలో వేతనం అందనుందని తెలుస్తోంది. ఈవై ఇండియా సంస్థ ప్రతినిధి రోహన్ సచ్ దేవ్ తమ సంస్థతో పని చేస్తున్న క్లయింట్లు కొత్త టెక్నాలజీలను కోరుకుంటున్నారని తెలిపారు.

క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నామని ఆయన తెలిపారు. కొత్త టెక్నాలజీల ద్వారా పని చేసిందుకు సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటున్నామని ఆయన అన్నారు. అవసరాలకు అనుగుణంగా భారీగా ఉద్యోగాల నియామకం చేపట్టడానికి సిద్ధమవుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈవే సంస్థ ఇండియాలోని బ్రాంచ్ లలో దాదాపు 50,000 మంది పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీ మొత్తంలో వేతనం లభించనుంది.

ప్రముఖ సంస్థ ఎల్‌ అండ్‌ టీ సైతం 2021 సంవత్సరంలో 1100 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్టు తెలుస్తోంది. 90 శాతం ఐఐటీలు, ఎన్‌ఐటీల నుంచి ఈ సంస్థ ఉద్యోగులను నియమించుకోనుందని తెలుస్తోంది.