ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత.. విషాదంలో సినీ పరిశ్రమ..

క‌న్న‌డ హాస్య‌న‌టుడు శంక‌ర్ రావు మృతి చెందారు. గ‌త కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఉన్నాడు. దీంతో అతడు రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి బెంగళూరులోని తన స్వగృహంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆయ‌న మృతి ప‌ట్ల చిత్ర‌ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు సంతాపం వ్యక్తం చేశారు. శంకర్​రావు మూడు దశాబ్ధాలుగా 100కు పైగా సినిమాల్లో నటించారు.

శంక‌ర్ రావు మృతికి ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా కన్నడ చత్ర పరిశ్రమలో గత కొంత కాలం నుంచి వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రముఖ కన్నడ నటుడు సత్యజిత్ (72) ఆదివారం తెల్లవారు జామున బెంగుళూరు లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తాజాగా హాస్యనటుడు శంకర్‌ రావు (88) అనారోగ్యంతో మృతి చెందడంలో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి.

అతడు ‘పాప పాండు’ సీరియల్‌ ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. దాంతోనే అతడు మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మాయ మృగ’, ‘సిల్లీ లల్లీ’ వంటి ప్రముఖ కన్నడ టీవీ సీరియల్స్‌లో న‌టించి ఆయ‌న మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా అతడు పలు సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు .

‘యారా సాక్షి’ చిత్రంతో తో తెర‌గ్రేటం చేశారు. విష్ణువర్ధన్, శంకర్ నాగ్, అనంత్ నాగ్, లోకేష్, శ్రీనాథ్, ద్వారకీష్, శివరాజ్ కుమార్, రవిచంద్రన్, రమేష్ అరవింద్, ఉపేంద్ర, పునీత్ రాజ్ కుమార్ మరియు దర్శన్ వంటి స్టార్ హీరోలంద‌రి సినిమాల్లోనూ న‌టించారు. ఆయ‌న మృతి క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ‌ను తీవ్ర విషాదంలో నెట్టింది.