నిధి అగర్వాల్ ఫేస్‌లో అసలు ఎక్స్‌ప్రెషన్సే లేవు.. సాంగ్ రికార్డ్ క్రియేట్ చేయడమెంటి ఖర్మ కాకపోతే అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు

నిధి అగర్వాల్ పక్కా హైదరాబాదీ ఐనప్పటికి చదువు, మోడలింగ్ కోసం బెంగళూరు, ముంబైలోనే ఉంది. అలా బాలీవుడ్ మేకర్స్ దృష్ఠిని ఆకట్టుకోవడం హిందీ సినిమాలో అవకాశం రావడం అలా జరిగిపోయాయి. మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ మంచి పేరే తెచ్చుకుంది. కానీ అక్కడ సెకండ్ మూవీ ఛాన్స్ మాత్రం దక్కించుకోలేకపోయింది. అయితే అదే సమయంలో టాలీవుడ్ నుంచి అవకాశాలు అందుకుంది. అక్కినేని నాగ చైతన్య నటించిన ప్రయోగాత్మక చిత్రం సవ్యసాచి. చందు మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

కథలో లోపం వల్ల ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. నిధి కాస్తో కూస్తో బాగా నటించిందని పేరు తెచ్చుకుంది. దాంతో నాగ చైతన్య తమ్ముడు అఖిల్ అక్కినేని సరసన నటించే అవకాశం అందుకుంది. మిస్టర్ మజ్ఞు సినిమాలో నిధి అవకాశం అందుకోవడంతో బ్యాక్ టు బ్యాక్ అక్కినేని సోదరులతో నటించడం కాస్త హాట్ టాపిక్ కూడా అయింది. అయితే ఈ సినిమా కూడా మేకర్స్ ఆశించినంత విజయాన్ని అందుకోలేదు. ఇలా బ్యాక్ టు బ్యాక్ తెలుగులో చేసిన రెండు సినిమా సక్సెస్ కాకపోవడం బాలీవుడ్‌లో చేసిన సినిమా సక్సెస్ కాకపోవడంతో నిధి కెరీర్ క్లోజ్ అనుకున్నారు.

కానీ మన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రాం హీరోగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. దాంతో ఒక్కసారిగా ఈ సినిమాలో నటించిన నిధి అగర్వాల్ – నభా నటేశ్‌లకి హీరోయిన్స్‌గా భారీ క్రేజ్ దక్కింది. ఈ సినిమా సక్సెస్‌తో నిధి లైఫ్ ఊపందుకుంది. తెలుగులో గల్లా అశోక్ డెబ్యూ సినిమా హీరో, క్రిష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలలో నటిస్తోంది. ముఖ్యంగా పవర్ స్టార్ సినిమాలో అవకాశం అంటే ఇది నిధికి గోల్డెన్ ఛాన్స్ అని చెపక తప్పదు.

అయితే ఇస్మార్ట్ శంకర్ తర్వాత తెలుగులో కంటే తమిళంలో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసే అవకాశం అందుకోవడం ఆసక్తికరం. జయం రవితో ‘భూమి’, శింబుతో ‘ఈశ్వరన్’ సినిమాలు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ‘ఈశ్వరన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిట్ టాక్ తెచ్చుకున్న ‘ఈశ్వరన్’ సినిమాతో నిధి కోలీవుడ్ ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ తెచ్చుకుంది. వాళ్ళకి తగ్గట్టుగా బొద్దుగా ఉండటం బాగా ప్లస్ అయింది. అయితే ఇప్పటి వరకు నిధి యాక్టింగ్ పరంగా మాత్రం నెగిటివ్ కామెంట్సే ఎదుర్కుంటోంది. ఫేస్‌లో అసలు ఎక్స్‌ప్రెషన్స్ ఉండవని ముందు నుంచి టాక్ ఉంది.

ఇదే క్రమంలో తమిళ సినిమా చూసిన ప్రేక్షకులు కొందరు కామెంట్ చేశారు. అయితే ఈ సినిమాలో ‘మాంగల్యం’ అనే పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే 150 మిలియన్ల మంది వీక్షించారు. గతంతో శింబు నటించిన ఏ చిత్రంలోని పాట ఈ రేంజ్‌లో ఆదరణ పొందిన దాఖలా లేకపోవడం గమనార్హం.. అని చెప్పుకుంటున్నారు. అయితే కాస్త నాలెడ్జ్ ఉన్నవారు, ఈ సాంగ్‌లో నిధి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ ఏంత బాగాలేవని కామెంట్ చేశారు. అయినా ఈ సాంగ్ ఈ రేంజ్‌లో వ్యూస్ ఎలా సాధించాయో అని షాకవుతున్నారు. కాగా ఈ సాంగ్ ఇంత వ్యూస్ రాబట్టడానికి మెయిన్ రీజన్ థమన్ అందించిన సంగీతం అని చెప్పాల్సిందే. ఆ తర్వాతే క్రెడిట్ ఎవరికిచ్చినా అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.