JD Chakravarthy: శివ సినిమా సమయంలోనే నాగార్జునతో గొడవ.. వార్నింగ్ ఇచ్చి వెళ్లారు: జేడీ చక్రవర్తి

JD Chakravarthy: సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు జేడీ చక్రవర్తి ఒకరు. ఈయన సినీ ప్రయాణం శివ సినిమాలో విలన్ పాత్ర ద్వారా మొదలైంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించినటువంటి జెడి చక్రవర్తి అనంతరం హీరోగా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించినటువంటి ఈయన కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి చక్రవర్తి ఇటీవల దయ అనే వెబ్ సిరీస్ తో పాటు ఇతర సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా మారినటువంటి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తన మొదటి సినిమా సమయంలోనే నాగార్జున్ తో గొడవ జరిగిందని ఆయన తనకు వార్నింగ్ ఇచ్చారంటూ ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

తాను మొదట నటించిన సినిమా శివ అని తెలిపారు ఈ సినిమాలో నాగార్జునకు విలన్ పాత్రలో నటించానని ఈయన వెల్లడించారు. అయితే ఈ సినిమా సమయంలో నాగార్జునతో నాకు గొడవ జరిగింది. నా తప్పు లేకపోయినా నాగార్జున నన్ను తిట్టారు అని వెల్లడించారు ఈ సినిమా షూటింగ్ పటాన్ చెరువులో ఒక కేఫ్ లో జరుగుతుండగా నేను లోపల నుంచి బయటకు వస్తున్న సమయంలో నా భుజం నాగార్జునకు తగిలింది. అది అనుకోకుండా జరిగింది అందులో నా తప్పు లేదని తెలిపారు..

క్షమాపణ చెప్పలేదు..
ఆ క్షణం నేను నాగార్జునకు క్షమాపణలు చెప్పి ఉంటే అంతటితో ఆ గొడవ ఆగిపోయింది కానీ నేను అలా చేయకపోవడంతో నాగార్జున నాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నాకు శివ మొదటి సినిమా ఆ సమయంలో నేను క్షమాపణలు చెప్పి ఉంటే సరిపోయేది అంటూ ఈ సందర్భంగా చక్రవర్తి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.