ఇదేమిరా సామీ…! తోటి కార్మీకుడికి సాయం చేద్దామని వెళ్లి తన చెయ్యిని కోల్పోవాల్సివచ్చింది…!

ఇదేమిరా సామీ…! తోటి కార్మీకుడికి సాయం చేద్దామని వెళ్లి తన చెయ్యిని కోల్పోవాల్సివచ్చింది…!

ఇదేమిరా సామీ…

ఉడ్‌వర్క్‌ సంస్థ లో చాలా వేగంగా తిరుగుతున్న రంపం మిషన్‌లో పొరపాటున చేయి పెట్టి మణికట్టు వరకు తెగిపడిన చేతిని గుంటూరు లలితా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో సర్జికల్‌ ఇంప్లాటేషన్‌ ద్వారా అతికించారు. అతికించిన చేయి చక్కగా పని చేస్తోంది. నవ్యాంధ్రలో ఇదే తొలి హ్యాండ్‌ ఇంప్లాంటేషన్‌ శస్త్రచికిత్సగా ఆపరేషన్‌ నిర్వహించిన కార్డియోథొరాసిక్‌, వ్యాస్క్యులర్‌ సర్జన్‌ డాక్టర్‌ మారుతీ ప్రసాద్‌ ఇమ్మిడిశెట్టి తెలిపారు. గుంటూరులోని ఉడ్‌వర్క్‌ కంపెనీలో జి.రవి(34) లారీ డ్రైవర్‌.

ఈ నెల 19న చెక్క దుంగలను రంపం మిషన్‌పై కోస్తున్న తోటి కార్మికుడికి సహాయం చేస్తుండగా.. పొరపాటున ఎడమ చేయి మిషన్‌లో పడింది. మణికట్టు వరకు చేయి తెగి కింద పడింది. వెంటనే తోటి కార్మికులు ఆ తెగిన చేతిని ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో వేసి బాధితుడిని లలితా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

వెంటనే వైద్య బృందం అత్యవసర సర్జరీ నిర్వహించింది. డాక్టర్‌ మారుతీ ప్రసాద్‌ నేతృత్వంలో ఆర్ధోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎన్‌వీ శివరామకృష్ణ, ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ విశ్వనాఽథ్‌, డాక్టర్‌ నిరంజన్‌ తదితరులు ఇంప్లాంటేషన్‌ సర్జరీ నిర్వహించారు. 19వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రారంభిస్తే.. మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు సర్జరీ కొనసాగింది. బాధితుడి చేతిలో విరిగిన ఎముకలు అతికించి, రక్తనాళాలను అనుసంధానం చేశారు. చివరగా టెండార్లు, నరాలను రీకన్‌స్ట్రక్షన్‌ చేసి విజయవంతంగా చేతిని అతికించారు. ఆపరేషన్‌ అనంతరం అతికించిన చేతి వేళ్ల కద లికలు బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.