All posts by telugudesk

GV Narayana : ఒకప్పుడు రజినీకాంత్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఈ హీరో ఆ తర్వాత ఎందుకు తెరమరుగయ్యారో తెలుసా.?!

GV Narayana : గుమ్మడికాయంత కష్టపడ్డా కూడా.. కనీసం ఆవగింజంత అదృష్టం ఉండాలన్నారు. నిజంగా ఇది సినీరంగంలో నటీనటులకు వర్తిస్తుందేమో అనిపిస్తుంది. కాళ్లకున్న చెప్పులరిగేలా తిరిగినా సినిమా అవకాశాలు దొరకని నటీనటులు ఎంతో మంది ఉన్నా.. కడుపులో చల్ల కదలకుండా అవకాశాలు దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి కోవలోకే అలనాటి నటుడు జి.వి.నారాయణ రావు వస్తారు. సినిమాల్లో పుట్టి సినిమాల్లో పెరిగిన జీ.వి.నారాయణ రావు తండ్రి విజయవాడలో నవయుగ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థను 1947లో ఏర్పాటు చేయడం జరిగింది. అలా దాదాపు కొన్ని వందల సంఖ్యలో తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలు దాదాపు 90 శాతం నవయుగ సంస్థ వారే డిస్ట్రిబ్యూట్ చేయడం గమనార్హం.

అలా జి.వి. నారాయణరావు కుటుంబం 1964 ప్రాంతంలో హైదరాబాద్ వచ్చి అక్కడ అమీర్ పేటలో సారథి స్టూడియోను నిర్మించారు. అక్కడే నారాయణ రావు తన కాలేజీ విద్యను మెహబూబా కాలేజీలో పూర్తి చేశారు. అలా చదువుకుంటున్న సమయంలోనే నారాయణరావు రవీంద్రభారతిలో నాటకాలు వేస్తూండేవాడు. అలా నటనలో శిక్షణ కోసం మద్రాసులో స్థాపించిన మద్రాస్ ఫిల్మ్ ఛాంబర్ లో యాక్టింగ్ కోర్సును రజినీకాంత్, ప్రదీప్ శక్తి, హేమా చౌదరి, నాజర్ లతో పూర్తి చేశారు. అయితే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే దర్శకుడు కె.బాలచందర్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కి వెళ్లి తాను తీయబోయే తెలుగు సినిమాకి రజినీకాంత్, జీ.వి.నారాయణ రావులను ఎంపిక చేసుకోవడం జరిగింది.

అలా కె.బాలచందర్ దర్శకత్వంలో 1976లో విడుదలైన అంతులేని కథ అనే చిత్రంలో రజనీకాంత్ జి.వి.నారాయణరావు జయప్రద హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇది ఎన్టీ రామారావు, వాణిశ్రీ లు హీరోహీరోయిన్లుగా నటించిన ఆరాధన చిత్రానికి పోటీగా విడుదల అయ్యింది. అయిన ఇది కథ కాదు సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది.

‌‌ఈ సినిమాలో నటించినందుకు జీ.వి నారాయణరావుకు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఈరంకి శర్మ దర్శకత్వంలో చిలకమ్మ చెప్పింది అనే సినిమాలో మళ్లీ రజనీకాంత్, నారాయణరావు కలిసి నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు ఏకంగా 7 ఉత్తమ అవార్డులు వచ్చాయి. అయితే అంతులేని కథ సినిమాలో “తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల” పాటకి నారాయణ రావు నటించడం జరిగింది. ఇప్పటికీ పెళ్లి వేడుకల్లో మిమిక్రీ కళాకారులు సైతం ఈ పాటనే మిమిక్రీ చేయడం జరుగుతుంది.

అయితే అంతులేని కథకు రజినీకాంత్ 1000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటే, నారాయణరావు 1500 రెమ్యూనరేషన్ తీసుకోవడం గమనార్హం. ఆ తర్వాత నారాయణరావు కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన అప్పటికీ అవి నారాయణరావును ఒక మాస్ హీరోగా నిలబెట్టలేకపోయాయి. ఆ తరువాత స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ.. 1997లో విడుదలైన హిట్లర్ సినిమాలో ఓ చిన్న క్యారెక్టర్ వేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో నారాయణరావు బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో కనిపిస్తున్నారు.

Hero Suman : జైలు జీవితం గడిపోచ్చినా.. హీరో సుమన్ ను పిలిచి పిల్లనిచ్చిన టాలీవుడ్ దిగ్గజం ఎవరో తెలుసా ?

Hero Suman : సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించాలంటే ఒక్క బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే చాలదు. స్వశక్తితో ముందుకు ఎదగాలి. అయితే పైకి ఎదుగుతున్న ప్రతిసారి కింద పడవేయడానికి చాలా మంది రెడీ గా ఉంటారు. అయితే జయాపజయాలు తట్టుకుని నిలబడడం అంటే సర్వ సాధారణ విషయం కాదు. అయితే ఒకప్పుడు ఎంతో క్రెజ్ ఉన్న హీరో ఒక్కసారిగా అట్టడుగు స్థాయికి పడిపోయి, మళ్ళీ పైకి ఎదగడం అంటే మాటలు కాదు. అలాంటి కోవకు చెందిన హీరోనే సుమన్. ఆరడుగుల అందగాడుగా టాలీవుడ్ లో ఎంతో మంచి పేరు ఉంది. తన అందంతో, అభినయంతో ఎన్నో సినిమాల్లో నటించి, అందరిని మెప్పించి అమ్మాయిల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరో సుమన్ అని అనడంలో అతిశయోక్తి లేదు. చాలామందికి సుమన్ అసలు పేరు తెలియదు. అందరికి సుమన్ గానే పరిచయం. కానీ, అయన అసలు పేరు సుమన్ తల్వార్. స్వతహాగా సుమన్ మాతృబాష తెలుగు కాకపోయినా గాని ఎంతో స్పష్టంగా, అచ్చమైన తెలుగులో మాట్లాడేవాడు. అందుకేనేమో తెలుగు ప్రజలు ఆయనను అక్కున చేర్చుకున్నారు.

సినీ ఇండస్ట్రీలోకి రాకముందు సినిమా అవకాశాల కోసం కష్టపడే సమయంలో హీరో బాను చందర్ తో మంచి సన్నిహిత సంబంధం ఏర్పడింది. దీనితో ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు. అంతేకాకుండా వీరిద్దరికి మార్షల్ ఆర్ట్స్ పై పట్టు కూడా ఉంది. అయితే మొదట సినిమాల్లో నటించే అవకాశం బానుచందర్ కి వచ్చింది. తరువాత సుమన్ ను సినిమాల్లో రికమండ్ చేయడం జరిగింది. అప్పటినుండి వీళ్ళు ఇద్దరు అనేక సినిమాల్లో నటించారు. అలాగే వీరు నటించిన సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్ ను విస్తృతంగా ఉపయోగించారు. ఫలితంగా మార్షల్ ఆర్ట్స్ గురించి అందరికి తెలిసేలా చేసారు. ఆ తరువాత తరంగిణి సినిమాతో పాటు, యువతను ఉద్దేశించిన నేటి బాలలు, దేశంలో దొంగలు పడ్డారు వంటి చిత్రాల్లో నటించి టాప్ రేంజ్ కి వెళ్ళాడు. ఒకానొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా పోటాపోటీగా సుమన్ సినిమాలు ఆడేవి. ఇలా మంచి ఉత్సహంతో ముందుకెళుతున్న సుమన్ కి ఒక కోలుకోలేని దెబ్బ తగిలింది.

నీలిచిత్రాల కేసులో సుమన్ పేరు తెరమీదకు రావడంతో అయన జైలుకి వెళ్ళాడు. ఒకానొక సందర్భంలో బెయిల్ కూడా దొరకక కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపాడు. ఆయన జైలు జీవితం గడపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అలాగే సినీ పరిశ్రమ కూడా షాక్ కు గురయింది. అలాగే సుమన్ కూడా బాగా కృంగిపోయాడు. జైలు నుంచి మళ్ళీ తిరిగి బయటకు వచ్చాక సినిమా ఛాన్సులు రాక, పరువు, ప్రతిష్ట మంటకలిసిపోవడంతో తేరుకోలేని డిప్రెషన్ లో పడిపోయాడు. ఆ తరువాత పెళ్లి అనే బంధంతో శిరీష రూపంలో మళ్ళీ అదృష్టం తలుపుతట్టింది.

గుండమ్మ కధ, బడి పంతులు, రాముడు భీముడు, యమగోల, కారు దిద్దిన కాపురం వంటి ప్రముఖ చిత్రాలు రచించిన ప్రముఖ రచయిత డివి నరసరాజు తన మనుమరాలను హీరో సుమన్ కి ఇచ్చి పెళ్లి చేసాడు. అయితే ప్రముఖ రచయత, సుమన్ ను పిలిచి మరి మనవరాలిని ఇవ్వడంతో అప్పట్లో సినీ ఇండస్ట్రీ ఆశ్చర్యానికి గురి అయింది. అప్పుడే అందరిలో ఆలోచన మొదలయింది. సుమన్ చెడ్డవాడు అయితే రాజుగారు పిలిచి మరి పిల్లను ఎందుకు ఇస్తాడు అనే అనుమానం మొదలయింది అందరిలో. పెళ్లి తరువాత సుమన్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు.

పెద్దింటి అల్లుడు, బావ బావమరిది, అబ్బాయిగారి పెళ్లి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మళ్ళీ పూర్వ వైభవాన్ని దక్కించుకున్నాడు. అలాగే ఆ తరువాత అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వరుని పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఈ సినిమాలో సుమన్ పాత్ర అమోఘం. ఈ సినిమా వల్లే సుమన్ కి మంచి పేరు ప్రతిష్టలు కూడా వచ్చాయి. ఆ తరువాత శ్రీరాముడు సినిమాలో రాముని పాత్ర దొరకడం సుమన్ కి మంచి ప్లస్ అయింది. ఆ తరువాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన శివాజీ సినిమాలో విలన్ పాత్రలో నటించి, తనలోని మరొక యాంగిల్ ను కూడా ప్రేక్షకులకు చూపించాడు. ఇలా సుమన్ కెరీర్ మలువు తిరిగి విజయానికి చేరువలో నడవడానికి కారణం అయన సతీమణి శిరీష. పెళ్లి అనే బంధం సుమన్ జీవితాన్ని మార్చేసింది. వీరికి ఒక్కగానొక్క కూతురు. ఆమె పేరు “అఖిలాజా ప్రత్యూష”. తన కూతురు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఎటువంటి అబ్యంతరం లేదని సుమన్ తేలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉంటున్నారు సుమన్.

Megastar Chiranjeevi : చిరంజీవితో హీరోయిన్ గా చేసి.. ఆ తర్వాత ఆయనకు తల్లి పాత్రలో నటించింది ఎవరు.?!

Megastar Chiranjeevi : అవకాశాలను అందిపుచ్చుకొని హీరోయిన్ గా తమ సత్తా చాటి వయసు మళ్లిన తర్వాత అదే హీరోలకి తల్లి పాత్రలో నటించిన వారు తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అలాంటి కోవలోకే చిరంజీవి తో చేసిన ఓ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. వారు ఒకప్పుడు చిరంజీవితో చిందులేసి పదిహేను సంవత్సరాల తర్వాత ఆయనకు తల్లి పాత్రలో చేశారు.

1979 కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది కథ కాదు. ఈ సినిమాలో చిరంజీవి, జయసుధ భార్యాభర్తలుగా నటించారు. ఆ తర్వాత 1986లో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాతగా విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన మగధీరుడు చిత్రంలో జయసుధ, చిరంజీవి కలిసి హీరో హీరోయిన్లుగా నటించారు. కట్ చేస్తే… 1995లో క్రాంతికుమార్ నిర్మాతగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన రిక్షావోడు చిత్రంలో చిరంజీవికి కి తల్లి పాత్రలో జయసుధ నటించింది.

1980లో చిట్టి బాబు దర్శకత్వంలో లో ప్రేమ తరంగాలు చిత్రంలో చిరంజీవి, సుజాత హీరో హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత 1982లో ఈరంకి శర్మ దర్శకత్వంలో వచ్చిన సీతాదేవి చిత్రంలో సుజాత చిరంజీవికి చెల్లెలిగా నటించింది. కట్ చేస్తే.. 1995లో మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాతగా విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన బిగ్ బాస్ చిత్రంలో చిరంజీవికి జోడిగా రోజా నటించగా ఆయనకు తల్లి పాత్రలో సుజాత నటించారు.

విచిత్రమేంటంటే 1980లో వచ్చిన ప్రేమ తరంగాలు చిత్రంలో చిరంజీవి, జయసుధ, సుజాత నటించారు. మరో విచిత్రమేమంటే సుజాత, జయసుధ చిరంజీవికి తల్లి పాత్రలో నటించిన రెండు చిత్రాలు (బిగ్ బాస్, రిక్షావోడు) 1995 లోనే విడుదల కావడం ఓ విశేషం.

Rajendra Prasad : ఆ సినిమా ఆడకపోతే నవ్వుల కిరీటి రాజేంద్ర ప్రసాద్ కెరీర్ దాదాపు గందరగోళంలో పడేది.?!

Rajendra Prasad : చిన్న క్యారెక్టర్స్,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నా రాజేంద్ర ప్రసాద్ కు మద్రాసులో ఒకసారి డబ్బింగ్ థియేటర్లో అప్పటి దర్శకుడు వంశీ పరిచయం కావడం జరిగింది.ఆ పరిచయం స్నేహంగా మారి ఒక సినిమా తీయడం వరకు వెళ్ళింది. 1985లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో వంశీ దర్శకత్వంలో ప్రేమించు పెళ్ళాడు సినిమాలో భానుప్రియ రాజేంద్రప్రసాద్ నటించారు. ఆ సినిమా మాత్రం బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్యూర్ అయింది.

అప్పటికీ రాజేంద్రప్రసాద్ పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ప్రేమించు పెళ్ళాడు సినిమా హిట్ కాకపోవడంతో హీరోగా ఛాన్స్ లు దొరకవు అలా అని డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పిలువరు, చిన్న క్యారెక్టర్స్ చేయడానికి ఆత్మ గౌరవం అడ్డు వస్తుంది. ఇలా రాజేంద్ర ప్రసాద్ అన్ని గుర్తు చేసుకుంటూ బాధతో తనలో తాను ఏడవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన దర్శకుడు వంశీ రాజేంద్రప్రసాద్ ను ఓదార్చడం మొదలు పెట్టాడు. అలా ఇద్దరూ ఒకే దగ్గర కూర్చొని ప్రేమించు పెళ్ళాడు సినిమా ఎందుకు ఫెయిల్ అయింది కారణాలేంటని ఆలోచించ సాగారు.

ప్రేమించు పెళ్ళాడు చిత్రంలో హీరోయిన్ ని ఫస్టాఫ్ మొత్తం ఏడిస్తే ప్రేక్షకులు అంతగా నవ్వారు. అంటే సెకండాఫ్ ఎక్కడో ప్రేక్షకులకు నచ్చలేదు కావున సెకండాఫ్ మొత్తం కూడా అలానే ఉంటే ఆ సినిమా ఆడేదేమో అని అనుకున్నారు. హీరో ఒక అమ్మాయిని ఏడిపిస్తే ఇంత రెస్పాన్స్ వచ్చినప్పుడు అనేక మంది అమ్మాయిలను ఏడిపిస్తే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే ఆలోచన లోంచి వచ్చిన సినిమానే లేడీస్ టైలర్.

1986 స్రవంతి మూవీస్ బ్యానర్ లో స్రవంతి రవికిషోర్ నిర్మాత గా వంశీ దర్శకత్వం లో రాజేంద్ర ప్రసాద్ అర్చనలు హీరోహీరోయిన్లుగా లేడీస్ టైలర్ విడుదలయింది. సినిమా ఆద్యంతం నవ్వులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన రాజేంద్ర ప్రసాద్ శుభలేఖ సుధాకర్ కామెడీ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇళయరాజా నేపథ్య సంగీతం, పాటలు ప్రేక్షకులను మైమరిపించేలా చేసాయి. రాజేంద్ర ప్రసాద్ కు లేడీస్ టైలర్ ఒక టర్నింగ్ పాయింట్ సినిమా గా పేర్కొనవచ్చు.

Sobhan Babu : 90 పైసల జీతానికి పని చేస్తున్న పొట్టి వీరయ్య జీవితాన్ని శోబన్ బాబు ఎలా మార్చారో తెలుసా ?

Sobhan Babu : గట్టు వీరయ్య.. ఈ పేరు వింటే చాలామందికి ఎవరంటే తెలియదు. అదే పొట్టి వీరయ్య అని చెప్తే ఇట్టే గుర్తు పట్టేస్తారు. పొట్టి వీరయ్య ఇదివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాల్లో నటించారు. అయితే ఈయన మరుగుజ్జు. ఆయన ఏకంగా 400 చిత్రాలలో నటించి శభాష్ అనిపించుకున్నారు. ఈయన తండ్రి పేరు సింహాద్రి, తల్లి పేరు నరసమ్మ. వీరిది సూర్యాపేట జిల్లా ఫణిగిరి గ్రామం. ఈయన ఫణిగిరి గ్రామంలో నాలుగో తరగతి వరకు చదువుకొని ఆ తర్వాత సూర్యాపేటలో పదవ తరగతి వరకు చదువుకున్నారు. ఇక ఈయన పదో తరగతిలో ఉత్తీర్ణులు కాకపోయే సరికి ఆయన ఏదో ఒక ఉద్యోగం చేయాలన్న సంకల్పంతో ఆయన 1967లో మద్రాసుకు వెళ్లిపోయారు.

ఇలా శోభన్ బాబు గారు కనపడగానే ఆయన దగ్గరికి వెళ్లి తాను వీరయ్య.. అని తాను పదో తరగతి వరకు చదువుకున్న అని తనకు బయట ఎవరు ఉద్యోగాలు ఇవ్వలేదని నాకు సినిమాలలో నటించే అవకాశం ఇవ్వడానికి సాయపడండి అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మాటలు విన్న శోభన్ బాబు వీరయ్య కు ఓ మంచి సలహా ఇచ్చారు. అదేమిటంటే.. నీలా ఉన్న వ్యక్తులకి ఇక్కడ అవకాశాలు ఉండవని, మీలాంటి వారికి తగిన వేషాలు ఇవ్వడానికి బావ నారాయణ గారు, లేకపోతే విఠలాచార్య సినిమాలలో అవకాశాలు లభిస్తాయని వీలైతే వారిని వెళ్లి సలహా ఇచ్చాడు. దీంతో పొట్టి వీరయ్య ఒకానొక సమయంలో విఠలాచార్యల గారిని కలిసారు. అయితే విఠలాచార్య గారితో జరిగిన సంభాషణల తర్వాత వీరయ్య కు సినిమా అవకాశం ఇచ్చారు. ఇందుకు సంబంధించి వెంటనే ఆయనకు 500 రూపాయలు అడ్వాన్స్ గా కూడా ఇచ్చాడు.

అయితే ఆయన చెన్నై నగరానికి చేరుకున్న తరువాత అక్కడ అ తమిళ బాష రాకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కాకపోతే, వీరి ఊరికి సంబంధించిన మంగళ గోపాల్ అనే వ్యక్తి చెన్నైలో ఉండడంతో అక్కడ ఆయన దగ్గర అ ఉండేవాడు. ఇక మనం మంగళ గోపాల్ పెళ్లిళ్లకు, సినిమాలకు ఫ్లవర్ డెకరేషన్ చేసే పని చేసేవారు. ఇకపోతే ఆ పూల అంగడి లో వీరయ్య నెలకు కేవలం 90 పైసలతో ఉద్యోగం చేసేవాడు. అయితే ఈ అంగడి గోల్డెన్ స్టూడియో కి చాలా దగ్గరగా ఉండేది. అలా గోల్డెన్ స్టూడియో కి దగ్గరగా ఉండడంతో పూలు అవసరమైనప్పుడు ఎలా అయినా సరే తాను స్టూడియోస్ లోకి వెళ్లి తన నటన ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి ఎవర్నో ఒకర్ని ఛాన్స్ అడగాలన్నా సమయంలో ఒక రోజున ఆయనకు శోభన్ బాబు గారు కనిపించారు.

అయితే ఆ తర్వాత అగ్గి వీరుడు అనే సినిమా తో వీరయ్య కు అవకాశాన్ని కల్పించారు. ఇక అప్పటి నుంచి వీరయ్య ఏకంగా 400 చిత్రాలలో నటించడం పూర్తి చేశారు. ఇలా ఆయన మొత్తం తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో సినిమాలలో నటించాడు. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు, శివాజీ గణేషన్, ఎంజీఆర్ లాంటి పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి సినిమాలలో నటించారు. ఇక ఈయనకు మల్లిక అనే ఆవిడతో వివాహం జరిగింది. వీరిది ప్రేమ వివాహం. వీరిద్దరికి మొత్తం ముగ్గురు పిల్లలు. 2008లో ఆయన భార్య కన్నుమూశారు.

టాలీవుడ్ ఉత్తమ నటుడు నారాయణ గుర్తున్నాడా? ఈయన కోడలు తెలుగు స్టార్ హీరోయిన్ అని తెలుసా ?!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సినిమా బ్యాక్ డ్రాప్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చి హీరోహీరోయిన్లుగా స్థిరపడిన వారు ఎందరో. అయితే ఇది వరకు కాలంలో మాత్రం ముందుగా నాటకాలలో నటించి ఆ అనుభవంపై సినిమాలలోకి వచ్చి పేరు పొందిన వ్యక్తులు ఎందరో. ఇలా ఇదివరకు కాలంలో ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆయన కష్టాలు పడి సినిమాల్లో నిలదొక్కుకున్న వ్యక్తి పి.ఎల్.నారాయణ. ఈయన నిజానికి మళయాల కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే ఈయన పుట్టుక గుంటూరు జిల్లా, బాపట్ల నగరంలో జరిగింది. ఇక అక్కడే బాల్యం లో విద్యనభ్యసించి ఆ తర్వాత ఒంగోలు ప్రజానాట్యమండలి ద్వారా కుక్క అనే నాటకం రాశారు. నాటకానికి జాతీయ అవార్డు కూడా దక్కింది. దీంతో ఆయనకు సినిమాలలో అవకాశం దక్కేలా చేసింది.

ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లాయర్, బడిపంతులు, రాజకీయ నేత, కార్మిక నేత, బిక్షగాడు, తాగుబోతు ఇలా ఎలాంటి పాత్ర అయినా సరే నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చారు. ఇలా నారాయణ తెలుగు, తమిళ చిత్రాల్లో కలిసి ఏకంగా 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. ఇకపోతే ఈయన కుటుంబం నుంచి మరో టాప్ హీరోయిన్ కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన సంగతి చాలా మందికి తెలియదు. ఆయన కుటుంబం నుంచి హీరోయిన్ గా చేసిన ఆవిడ ఎవరో కాదండి… టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అయిన శ్రీకాంత్ భార్య ఊహ. అవును… ఊహకు పి.ఎల్.నారాయణ స్వయానా మేనమామ.

ఇక ఊహ విషయానికి వస్తే, ఊహ మొట్టమొదటగా తమిళ సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఊహ అసలు పేరు శివరంజని. ఆవిడ తెలుగులో నటించకు ముందే తమిళంలో 20 సినిమాలకు పైగా నటించారు. అక్కడ ఆవిడ ఒకానొక దశలో స్టార్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈవివి సత్యనారాయణ గారు నిర్మించిన ఆ చిత్రంలో శివరంజని పేరును కాస్తా ఊహ గా మార్చేసి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు ఆవిడ చేస్తూ ఉండగా.. అందులో హీరో శ్రీకాంత్ తో అత్యధికంగా సినిమాలను చేసేవారు. ఇకపోతే ఆ సినిమాల నేపథ్యంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మొదటగా వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి వారి ఇంట్లో అడ్డు చెప్పడంతో వారు బయటికి వెళ్లి వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఇప్పుడు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కూడా ఉన్నారు.

అయితే టాలీవుడ్ లో ఊహ అనేక చిత్రాలను చేయగా మొదటి సినిమా అలాగే చివరి సినిమా కూడా తన భర్త శ్రీకాంత్ తో చేసినది కావడం విశేషం. ఇకపోతే ప్రస్తుతం వీరి పిల్లలు కూడా సినిమాలలో నటించిన సంగతి చాలా మందికి తెలియదు. శ్రీకాంత్ ఊహ ల కుమార్తె గుణశేఖర్ నిర్మించిన రుద్రమదేవి సినిమాలో రుద్రమదేవి చిన్ననాటి క్యారెక్టర్ రోల్ లో నటించింది. అలాగే పెద్ద కొడుకు రోషన్ అక్కినేని నాగార్జున నిర్మించిన నిర్మల కాన్వెంట్ సినిమాలో హీరోగా నటించి మెప్పించాడు. ఇకపోతే శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన హీరోగా మాత్రమే కాకుండా వివిధ రకాల క్యారెక్టర్స్ చేసుకుంటూ తనదైన మార్క్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో చూపించాడు. ప్రస్తుతం ఆయన అనేక వ్యాపారాలు చేసుకుంటూ వీలు దొరికినప్పుడల్లా సినిమాలలో నటిస్తున్నారు.

ఇతడు చనిపోయే వరకు కూడా తెలియదు.. ఆ ఇంటి అల్లుడని..!! అసలు ఏమి జరిగింది?

ప్రస్తుతం సోషల్ మీడియా కారణంగా ప్రపంచం మొత్తంలో ఏ విషయమైనా సరే నిమిషాల్లో ఇట్టే అందరికీ తెలిసిపోతుంది. అయితే సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందిన కొన్ని విషయాలు మాత్రం అలా తెలియకుండా అలా ఉండి పోతాయి. అయితే ఆ తర్వాత ఏదో ఒక సమయంలో పూర్తి వివరాలు బయటకు వస్తాయి. అయితే ఇలా చాలా సినిమా వారి జీవితాలకు సంబంధించి మొదట బయటికి రాకపోయినా ఆ తర్వాత ఆ విషయాల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొన్న వారి నుండి ఏదో ఒక సమయంలో పూర్తి వివరాలు బయటకు వస్తాయి. అటువంటి జీవితానికి సంబంధించి హీరో చరణ్ రెడ్డి జీవితం దగ్గరగా ఉంటుంది.

ఈయన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం చెందినవారని సమాచారం. 2001 సంవత్సరంలో రామోజీరావు కి సంబంధించిన ఉషాకిరణ్ మూవీస్ లో ఇష్టం అనే సినిమా ద్వారా వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాతో చరణ్ రెడ్డి మాత్రమే కాకుండా హీరోయిన్ శ్రియ శరణ్ కూడా వెండి తెరకు పరిచయం అయ్యింది. అంతే కాదు ఆ సినిమా డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ కూడా పరిచయమయ్యారు. ఈయన ఆ తర్వాత ఇష్క్, 24, మనం సినిమాలను నిర్మించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇష్టం సినిమా మాత్రం అసలు బాగా ఆడలేదు. దీంతో హీరో చరణ్ రెడ్డి సినిమాలలో నటించడం మానేశారు.

అయితే ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, హీరో సుమంత్ సోదరి అయిన సుప్రియ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. సుప్రియ కూడా పవన్ కళ్యాణ్ నటించిన మొట్ట మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ తర్వాత సుప్రియ హీరోయిన్ గా నటించడం మానేసి ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో సంబంధించి వ్యవహారాలను చూడడం మొదలుపెట్టింది.

అయితే దురదృష్టవశాత్తు చరణ్ రెడ్డి కేవలం తన 36వ ఏటనే మరణించారు. అయితే ఆయన మరణించే సంవత్సరం తన భార్య సుప్రియ తో విడాకులు కోసం కోర్టును ఆశ్రయించాడు. అయితే మరణానంతరం ఆయన ను పరిశీలించిన వైద్యులు తీవ్ర గుండెనొప్పితో మరణించాడు అని తేల్చారు. గుండెనొప్పి రావడంతో హైదరాబాదులోని అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేసారు హాస్పిటల్ లోనే మరోసారి తీవ్రమైన గుండె నొప్పి రావడంతో దాంతో డాక్టర్లు రక్షించలేక పోయారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆయనకు ఫోరెన్సిక్ బృందం నిర్వహించిన పరీక్షలో ఆయన పూర్తిగా తాగుడుకు బానిస కావడం వల్లనే ఆయన లివర్ పాడవడం ద్వారానే ఆయన మరణించినట్లు తెలిపారు. అయితే ఆయన నటించిన ఇష్టం సినిమాకి డైరెక్టర్ విక్రమ్ తో పాటు రాజ్ కుమార్ కూడా సహాయ దర్శకుడిగా పని చేశారు.

అలా ఇష్టం సినిమాతో తన కెరీర్ నిర్మించుకున్న చరణ్ రెడ్డి ఆ తర్వాత కుటుంబ సమస్యల నేపథ్యం భాగంగా చివరికి తాను మందుకు బానిసైన అయి చివరికి మరణించడం జరిగింది. చరణ్ చనిపోయే వరకు ఎక్కడ తన అత్తగారింటి పేరును కానీ కాంటాక్ట్స్ ని కానీ వాడుకోకపోవడం వల్లనే ఆయనకు ఎక్కువగా అవకాశాలు రాలేదని అలాగే మీడియా కూడా అప్పట్లో పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదని నాగార్జునకు కొడుకు వరస అయినా కూడా అయన కూడా ఎక్కడ చరణ్ పేరును ప్రస్తావించకపోవడం నిజాన శోచనీయం. చరణ్ తోపాటు ఇష్టం సినిమా లో హీరోయిన్ గా నటించిన శ్రేయ శరణ్ మాత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో అగ్రతారల సరసన టాప్ హీరోయిన్ గా చలామణి అయ్యింది. ప్రస్తుతం ఆవిడ విదేశీయుడిని పెళ్లి చేసుకుని అక్కడే నివసిస్తున్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి, త్రివిక్రమ్ కి మధ్య గల బంధుత్వం ఏంటో తెలుసా.?!

సీతారామశాస్త్రి సిరివెన్నెల సినిమాతో సిరివెన్నెల నే తన ఇంటి పేరు చేసుకుని సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును పొందారు. సిరివెన్నెల సినిమా కంటే ముందే అప్పటికీ ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి వంటి సినీ కవుల దిగ్గజాలు ఉన్నప్పటికీ ఎక్కడో, ఎప్పుడో కె. విశ్వనాథ్ సీతారామశాస్త్రి శ్లోకాలు విని తాను తీయబోయే సిరివెన్నెల సినిమా కు సీతారామశాస్త్రి చే పాటలు పాడించాలనుకున్నారు. ఆ క్రమంలో “సిరివెన్నెల” సినిమాకి అత్యద్భుతమైన పాటలు సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారాయి.

ఇక మాటల మాంత్రికుడిగా పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటగా స్వయంవరం చిత్రానికి మాటలు రాయడం జరిగింది. ఆ తర్వాత సినీ ప్రయాణంలో తాను వెనుతిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. మాటలు, స్క్రీన్ ప్లే అందించిన తర్వాత నువ్వే నువ్వే సినిమా తో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, అరవింద సమేత వీర రాఘవ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ 2002లో శాస్త్రీయ నృత్యకారిని అయినా సౌజన్య ను వివాహం చేసుకున్నారు. విశాఖపట్నంలో సంగమం ఫౌండేషన్ వారు నిర్వహించిన నృత్య విభావరి లో సౌజన్య పాల్గొని అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. దానికి గెస్ట్ గా హాజరైన సిరివెన్నెల సీతారామశాస్త్రి, త్రివిక్రమ్ శ్రీనివాసులు ఆమెను అభినందించారు. అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుని కూతురు నే త్రివిక్రమ్ శ్రీనివాస్ వివాహం చేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే వీరిది మామ అల్లుళ్ళ బంధంగా పేర్కొనవచ్చు.

కమెడియన్ సుధాకర్ సంపాదించిన ఆస్తులన్నీ ఏమయ్యాయి? అసలు ఎవరి వల్ల అయన కోమాలోకి వెళ్ళాడు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఎన్నో సినిమాల్లో నటించిన కానీ, చివరికి సంపాదన మాత్రం లేకుండా ఎంతో మంది ఇబ్బందులు పడిన వారిని మనం చాలా మందినే చూశాం. అయితే కేవలం తెలుగులోనే మాత్రం కాకుండా మిగతా భాషల్లో కూడా వివిధ సినిమాల్లో వివిధ క్యారెక్టర్లు వేస్తూ పేరు అంతగా లేకపోయినా సంపాదన గడించిన వారు ఎందరో ఉన్నారు కూడా. ఇక అసలు విషయంలోకి వెళితే.. మెగాస్టార్ స్నేహితుడు కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కమెడియన్ సుధాకర్ తమిళ భాషలో ఒకానొక సమయంలో స్టార్ హీరోగా చేసిన వ్యక్తి. ఒకవైపు తమిళంలో హీరోగా నటిస్తూనే మరోవైపు తెలుగులో స్టార్ కమెడియన్ గా ఎదిగారు.

ఇక ఈయన ఫిబ్రవరి 1,1956 సంవత్సరంలో జన్మించారు. ఈయన స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. సుధాకర్ తండ్రిగారు రత్నం. ఈయన ఓ డిప్యూటీ కలెక్టర్. తల్లి పేరు కటాక్షమ్మ. ఈ ఇరువురి దంపతులకు మొత్తం ఏడు మంది మగ సంతానం. ఇందులో సుధాకర్ చివరి వ్యక్తి. తండ్రి ఉద్యోగంలో విధులు నిర్వర్తించడానికి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించడం కారణంగా ఆయన తన కుటుంబాన్ని తీసుకోని వెళ్లి అక్కడ వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహించారు. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కోవెలకుంట్ల లో సుధాకర్ జన్మించారు.

ఆయన బాల్యం మొత్తం కోవెలకుంట్ల, ఆదోని, కోడుమూరు, కర్నూల్, బోధన్, కాకినాడ మొదలగు ప్రాంతాలలో గడిచింది. ఆయన విద్యాభ్యాసం ఎక్కువగా ఏలూరు, గుంటూరు లో జరిగింది. ఇక తను సినిమా మొదటి రోజుల్లో చిరంజీవి, హరి ప్రసాద్, నారాయణరావు లతో కలిసి ఒకే గదిలో నివసించేవారు. అలా మొదట్లో సినిమాల కోసం వేటలో ఉన్న సుధాకర్ కు ఆ సమయంలో దర్శకుడిగా ఉన్న భారతీరాజాను కలవడం తో ఆయనకు కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్ అనే సినిమాలో నటించాడు. ఈ అప్పట్లో భారీ సినిమా విజయం సాధించింది.

తమిళంలో స్టార్ హీరో గా కొనసాగిన సుధాకర్ జూన్ 29, 2010 న అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరి కోమాలోకి వెళ్లిపోయారు. ఈయన తెలుగులో సృష్టి రహస్యలు అనే సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. సుధాకర్ తెలుగులో ఒక కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సేవలను టాలీవుడ్ కి అందించారు. ఈయన తెలుగులో కొన్ని సినిమాలలో నటనకు ఆయన చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈయన చిరంజీవి కంటే ముందుగా హీరోగా తమిళంలో సినిమా చేశారు.

ఇక ఈయనతో తమిళంలో హీరోయిన్ అయిన రాధిక తో కలిసి 18 సినిమాల్లో నటించారు. అంతే కాకుండా తమిళంలో మొత్తం 45 సినిమాల వరకు ఈయన నటించారు. వీరి స్నేహితులైన చిరంజీవి, హరి ప్రసాద్ ల కంటే ఈయన చాలా ముందు ఉండేవారు. అయితే తమిళ ఇండస్ట్రీ, రాజకీయాల్లో వచ్చిన మార్పుల కారణాల వల్ల ఆయన తమిళంలో సినిమాలు చేయడం మానేశారు. ఆ తర్వాత కేవలం టాలీవుడ్ సినిమాలకే పరిమితం అయ్యారు. ఇక టాలీవుడ్ లో ఆయన విలన్ క్యారెక్టర్స్, అలాగే కమెడియన్ గా స్థిరపడిపోయారు. అంతే కాదు ఆయన కొన్ని చిత్రాలను కూడా నిర్మించాడు.

అందులో మొదటగా చిరంజీవితో కలిసి యముడికి మొగుడు సినిమా ను కూడా నిర్మించాడు. సుధాకర్ తో పాటు వారి స్నేహితులు కూడా కలిసి ఆ సినిమాను నిర్మించారు. వీటితోపాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరికొన్ని సినిమాలను కూడా ఆయన నిర్మించాడు. ఇక పెద్దరికం లాంటి కొన్ని సినిమాలలో సుధాకర్ నటన ను బయటకు తీసుకువచ్చాయి. శుభాకాంక్షలు,స్నేహితులు వంటి సినిమాలకు ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డులు గెలుచుకున్నారు.

అయితే 2010 సంవత్సరంలో అనారోగ్యం కారణంగా కోమాలోకి వెళ్లిన ఆయన 2015 సంవత్సరంలో తిరిగి కోలుకున్నారు. ఆ తర్వాత కూడా తాను సినిమాల్లో నిర్మించబోతున్నట్లు తెలియజేశాడు. అయితే తాను నటన జీవితంలో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా వివిధ రూల్స్ పోషించిన ఆయన ఆస్తులను అప్పట్లో బాగానే కూడబెట్టారని టాలీవుడ్ టాక్. ఆయన ఆస్తులు కొన్ని కోట్ల రూపాయలు ఉంటాయని చాలామంది చెప్పేవారు. ఆయన మిత్రుడు నారాయణ రావు కూడా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. సుధాకర్ కోమలో ఉన్నప్పుడు ఆయన కుటుంబానికి అన్ని విధాల తన స్నేహితులు నారాయణరావు, చిరంజీవి లు సహాయం చేశారు.

టెంపర్ సినిమాలో ఆ పాత్ర నారాయణమూర్తి ఎందుకు చేయన్నన్నారో తెలుసా.?!

రామయ్య వస్తావయ్య, రభస చిత్రాల ఫెయిల్యూర్స్ తో సందిగ్ధంలో పడ్డ జూనియర్ ఎన్టీఆర్ కి అర్జెంటుగా ఒక బ్లాక్ బస్టర్ సినిమా కావాలి అనిపించింది. ఎప్పుడూ సొంత కథలతో సినిమాలు తీసే పూరి జగన్నాథ్ కి వక్కంతం వంశీ చెప్పిన డిఫరెంట్ పోలీస్ ఆఫీసర్ స్టోరీ నచ్చడంతో బండ్ల గణేష్ నిర్మాతగా టెంపర్ అనే సినిమాను రూపొందించడం జరిగింది.

అయితే కథా రచయిత వక్కంతం వంశీ మొదటగా ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన కలుసుకోవాలని చిత్రానికి కథ అందించడం జరిగింది.కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అశోక్ చిత్రానికి కథ రాస్తే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మహేష్ బాబు తో వచ్చిన అతిథి సినిమా కూడా అపజయాన్ని చవిచూసింది.

తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన కిక్ మూవీ సూపర్ హిట్ అయింది. అప్పుడు వక్కంతం వంశీకి చాలా రోజుల తర్వాత రచయితగా గా ఒక హిట్ రావడం ఆయన కెరీర్ కి బూస్టింగ్ లాంటిదిగా పేర్కొనవచ్చు. ఆ తర్వాత వచ్చిన ఊసరవెల్లి యావరేజ్ గా నిలువగా ఎవడు సినిమా సూపర్ హిట్ అయింది.ఆ తర్వాత ఈయన కలం లోంచి వచ్చిన రేసుగుర్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా తర్వాత వక్కంతం వంశీ కథ అందించిన చిత్రం టెంపర్.ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి వేసిన కానిస్టేబుల్ పాత్రను మొదటగా ఆర్.నారాయణమూర్తి ని అడుగగా తాను ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే పైకి వచ్చానని కానీ ఇప్పుడు మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయనని తనను ఓ ప్రధాన పాత్రలో ఏ.ఎన్నార్ వేసిన మూగ మనసులు, సోమయాజులు వేసిన శంకరాభరణం లాంటి సినిమాలు ఏవైనా తాను నటించడానికి ఎప్పుడూ సిద్ధమేనని వినమ్రంగా ఆ ఆఫర్ని తిరస్కరించడం జరిగింది.