Categories: General News

డ్రైవింగ్ లైసెన్స్ 50 ఏళ్లు..? కొత్త ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా చర్చ

దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కోట్లాది మంది వాహనదారులకు ఊరటనిచ్చేలా లైసెన్స్ వ్యాలిడిటీని ప్రస్తుతం ఉన్న 20 ఏళ్ల నుంచి ఏకంగా 50 ఏళ్లకు పెంచే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయి. ఈ మార్పు అమలులోకి వస్తే లైసెన్స్ రినైవల్ కోసం తరచూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గనుంది.

ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ 20 ఏళ్ల వరకు లేదా నిర్దిష్ట వయసు పరిమితి వరకు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత వైద్య పరీక్షలు, అవసరమైన పత్రాలు సమర్పించి రినైవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడమే కాకుండా డిజిటల్ సేవలను విస్తరించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ కొత్త ఆలోచనను పరిశీలిస్తోంది.

అయితే లైసెన్స్ గడువు పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సంబంధిత శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ప్రాథమిక స్థాయిలో ఉన్న ప్రతిపాదన మాత్రమేనని తెలిపారు. రవాణా వ్యవస్థలో సులభతరం, పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా వివిధ మార్పులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ ప్రతిపాదనపై కొన్ని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రినైవల్స్ తగ్గితే ఆదాయంపై ప్రభావం పడుతుందేమోనని భావిస్తున్నాయి. అయితే డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ సేవల ద్వారా ఆదాయానికి పెద్దగా ఇబ్బంది ఉండదని కేంద్ర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహన యాజమాన్య మార్పిడి, పర్మిట్ రినైవల్ వంటి సేవలను కూడా పూర్తిగా ఆన్‌లైన్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు కార్యాలయాలపై భారం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.

ఇంకో కీలక ప్రతిపాదనగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు డీమెరిట్ పాయింట్ల వ్యవస్థను అమలు చేసే ఆలోచన కూడా పరిశీలనలో ఉంది. తప్పులు చేసిన డ్రైవర్లకు పాయింట్లు తగ్గించి, వాటి ఆధారంగా లైసెన్స్ సస్పెన్షన్ లేదా రద్దు చేసే విధానం తీసుకురావాలని సూచనలు ఉన్నాయి. అయితే ఈ మార్పుల అమలుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago