హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ తినే వాళ్లకు షాకింగ్ న్యూస్…?

మనలో చాలామంది ఇంటి ఫుడ్ నచ్చకపోవడం వల్ల, ఇతర కారణాల వల్ల హోటళ్లు, రెస్టారెంట్ల ఫుడ్ తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. హోటల్ ఫుడ్ తినడానికి ఎంతో రుచిగా ఉంటుందని.. అందువల్లే ఆ ఫుడ్ వైపు ఆకర్షితులవుతున్నామని చెబుతూ ఉంటారు. మరి కొందరు హోటల్, రెస్టారెంట్లకు వెళ్లే ఓపిక లేక ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. అయితే హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది.

తాజాగా ఏపీలోని ప్రధాన పట్టణాల్లో ఒకటైన విజయవాడలోని బార్బీక్యూ నేషన్స్‌ పై అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అధికారులే ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని రెస్టారెంట్ కు వెళ్లిన అధికారులకు అక్కడ పాచిపోయిన ఆహార పదార్థాలు అమ్ముతున్నట్టు తేలింది. రెస్టారెంట్ లోని మాంసం మురిగిపోయిందని, హల్వా ప్యాకెట్లపై ఫంగస్ చేరిందని అధికారులు గుర్తించారు.

అధికారులు పరీక్షల నిమిత్తం ఆహార పదార్థాలను ల్యాబ్ కు పంపించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా అధికారులు రెస్టారెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోనున్నారు. స్టోర్ అంతా పాచిపోయిన ఆహార పదార్థాలు ఉండటంతో అధికారులు షాక్ అయ్యారు. నగరంలోని ఇతర హోటళ్లు, రెస్టారెంట్లపై కూడా అధికారులు దాడులు చేసే అవకాశం ఉంది. వైద్య నిపుణులు ప్రజలు ఇంట్లో వండిన ఆహారమే మంచిదని చెబుతున్నారు.

హోటళ్లు, రెస్టారెంట్లలో రుచి కోసం కెమికల్స్ వాడతారని ఆ కెమికల్స్ వల్ల శరీరానికి నష్టం వాటిల్లుతుందని తెలుపుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి ఎక్కువగా భోజనం చేసే భోజన ప్రియులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.