వేలాది బొద్దింకలతో రోత పని.. అతని రివేంజ్ అలా?

సాధారణంగా మనకు ఎవరైనా అప్పు చెల్లించాలి అంటే వారికి కొద్ది రోజులు గడువు ఇస్తాము. అయినా చెల్లించకపోతే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చేస్తాం.కానీ ఇక్కడ దుండగలు మాత్రం తమకు అప్పు చెల్లించలేదని ఒక రెస్టారెంట్ పై దాడి చేసిన సంగతి తెలిస్తే ఆశ్చర్యపోతారు. హోటల్ యాజమాన్యం అప్పు చెల్లించలేదని కోపంతో హోటల్ మొత్తం వేలాది బొద్దింకలను వదిలిన వెళ్లిన ఘటన తైవాన్‌లోని తైపీలో గల జి-హౌస్ రెస్టారెంట్‌లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే హోటల్ యజమాని హోటల్ నిర్మాణ సమయంలో కొంత అప్పుగా ఇతరుల నుంచి తీసుకున్నారు. అయితే తన అప్పు చెల్లించలేదని కోపంతో ఇద్దరు వ్యక్తులు సాధారణ కస్టమర్ లాగా హోటల్ లోకి వచ్చారు. అయితే తమతో పాటు సంచులలో వేలాది బొద్దింకలను తీసుకువచ్చి ఆ రెస్టారెంట్ లో వదిలి పారిపోయారు. దీంతో హోటల్ మొత్తం బొద్దింకలు పాకాయి.అప్పు చెల్లించలేదని నిందితులు ఈ విధంగా రివేంజ్ తీర్చుకున్నారు.

ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తైపీ పోలీస్ కమిషనర్ చెన్ జీయా చాంగ్ విలేకరులతో మాట్లాడుతూ కేవలం అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతోనే ఈ విధమైనటువంటి పాడు పనికి పాల్పడినట్లు తెలిపారు. ప్రజలు ఆహారాన్ని తీసుకొనే రెస్టారెంటులోకి వ్యాధులు కలిగించే బొద్దింకలను వదలడం నేరమే. నిందితులను తప్పకుండా శిక్షిస్తాం అని తెలిపారు. రెస్టారెంట్ యాజమాన్యం ఈ విషయంపై స్పందిస్తూ వారు ఎవరో తమకు తెలియదని, రెస్టారెంట్ మొత్తం రసాయనాలతో శుద్ధి చేసిన తర్వాతనే ఓపెన్ చేస్తామని తెలిపారు.