అమెజాన్ ద్వారా ఆన్ లైన్ లో గంజాయి కూడా దొరుకుతుంది..! వీళ్లు చేసేది తెలిసి షాక్..

ఈ కామర్స్ సంస్థల్లో ఎక్కువగా పాపులర్ అయినవి అమెజాన్, ప్లిఫ్ కార్టు. వీటి ద్వారా నిత్యావసర సరుకులతో పాటు, గాడ్జెస్, విద్యుత్ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్ మరియు ఇంటి సామాగ్రిని కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో కూర్చొని ఆ సంస్థల వెబ్ సైట్ కి వెళ్లి బుక్ చేసుకుంటే.. ఇంటికే డెలివరీ అయిపోతాయి. వీటికి ఒక ఆఫీస్ అంటూ ఏం ఉండదు.

అంతా ఆన్ లైన్ ద్వారానే జరుగుతుంది. అయితే ఇక్కడ అమెజాన్ లో ఇవన్నీ కాకుండా గంజాయి కూడా దొరుకుతుందట. కొంతమంది ఎవరికీ తెలియకుండా.. అనుమానం రాకుండా ఆన్‌లైన్‌లో సేవల ద్వారా గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ఇటీవల పోలీసులు ఇలా అమెజాన్ ఆన్ లైన్ ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అస్సలు ఎలా జరుగుతుంది.. ఎక్కడ నుంచి జరుగుతోంది అనే విషయాలను రాబట్టారు పోలీసులు.

విశాఖపట్టణం కేంద్రంగా మధ్యప్రదేశ్‌కు గంజాయిని సరఫరా చేసినట్లు నిర్ధారించారు. ఈ విషయాలను మధ్యప్రదేశ్ పోలీసులకు చేరవేయగా అక్కడ బెండీలో కేసు నమోదు చేశారు. అక్కడ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా నేడు విశాఖకు చేరుకున్నారు. విశాఖలోని ఓ ఆన్ లైన్ స్టోర్ లో.. కాఫీ పొడి, కరివేపాకు పొడి పేరుతో డబ్బాల్లో గంజాయి పెట్టి.. గంజాయిని అక్రమంగా సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

అందులో కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. వాళ్లు పార్సల్ రూపంలో ఇస్తుంటే.. వాటిని శ్రీనివాస్‌ అనే వ్యక్తి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇంకా ఈ వ్యవహారంలో ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.