వామ్మో.. ఎంత పెద్ద సాలీడు గుళ్ళు.. ఎప్పుడైనా చూశారా?

సాధారణంగా మనం కొన్ని రోజుల పాటు ఇంటిలో దుమ్ము ధూళిని శుభ్రపరిచకపోతే మన ఇంటిలో గోడలకు సాలెపురుగులు గూడు కట్టుకోవడం చూస్తుంటాము. ఈ విధంగా సాలెపురుగులు మన ఇంట్లో గూడు కడితే వెంటనే ఇంటిని శుభ్రపరచడం చేస్తుంటాము. కేవలం ఇంటిలో మాత్రమే కాకుండా సాలెపురుగులు చెట్లు, పుట్టలకు సైతం గూడును కడుతుంటాయి.

ఈ విధంగానే ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో గిప్స్ ల్యాండ్ ఈ ప్రాంతంలో కూడా సాలీడులు గూడును నిర్మించాయి. అయితే ఇందులో పెద్ద స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా… సాలి పురుగులు గూడును కట్టాయి అంటే మన ఇంట్లో నిర్మించినట్టుగా అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఈ గిప్స్ ల్యాండ్ ప్రాంతాన్ని ఏకంగా లక్షలాది సాలీడులు సొంతం చేసుకుని గూడును నిర్మించాయి.

ఒకేసారి లక్షలాది సాలీడులు ఆ ప్రాంతాన్ని ఆక్రమించడమే కాకుండా గూడును నిర్మించడంతో ఆ ప్రాంతం మొత్తం ఒక ఒక దుప్పటి కప్పిన విధంగా కనబడుతోంది. ఏకంగా ఈ సాలెపురుగులు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు గూడును నిర్మించాయి. అయితే ఇక్కడ ఆక్రమించుకున్న సాలెపురుగులు మన ఇంట్లో పెరిగే సాలెపురుగులు కన్నా ఎంతో భిన్నంగా ఉంటాయి. వాగ్రాంట్ హంటర్ జాతికి చెందిన ఈ సాలెపురుగులు భూమిలోపల నివసిస్తాయి.

భూమి లోపల నివసించే ఈ సాలెపురుగులు వరద ప్రభావం నుంచి తప్పించుకోవడం కోసం ఈ విధంగా ఆ ప్రాంతం మొత్తం గూడును నిర్మించుకుంటాయి. తాజాగా ఈ ప్రాంతంలో కూడా వరదలు రావడంతో భూమి లోపల ఉన్నటువంటి ఈ సాలెపురుగులు మొక్కలకు, చెట్లకు లాలాజలం స్రవించి ఈ విధంగా గూడును నిర్మించాయి. ప్రస్తుతం సాలెపురుగులు నిర్మించుకున్న ఈ గూడుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.