Good News: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..! ఇక అన్నీ ఆ కార్డులోనే..!

Good News: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..! ఇక అన్నీ ఆ కార్డులోనే..!

Good News: తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలను ఈ హెల్త్ రికార్డ్ పేరిట నమోదు చేయనుంది. దీంతో రాష్ట్రంలోని అందరి ఆరోగ్య వివరాలను సేకరించి రికార్డ్ రూపంలో నమోదుచేయనుంది.

Good News: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..! ఇక అన్నీ ఆ కార్డులోనే..!
Good News: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..! ఇక అన్నీ ఆ కార్డులోనే..!

ఇప్పటికే ఈ- హెల్త్ రికార్డ్ కార్డుల కోసం ప్రభుత్వం ఆర్డర్ పెట్టింది. రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలు, వ్యాధులు అన్ని ఈ రికార్డ్ లో నమోదుకానున్నాయి. సుమారు 17 రకాల వివరాలను ఇందులో రికార్డ్ చేయనున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్ వేర్ రూపొందించి.. ఒక్కో వ్యక్తికి ఒక్కో యూనిక్ ఐడీ నెంబర్ ఇవ్వనున్నారు. 

Good News: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..! ఇక అన్నీ ఆ కార్డులోనే..!

ఈ వివరాలను రాష్ట్రంలోని ప్రతీ ఆసుపత్రికి అనుసంధానించనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు ఈ వివరాలను అనుసంధానం చేయనున్నారు. దీని వల్ల ప్రతీ ఒక్కరి ఆరోగ్య వివరాలు, వారి హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఆసుపత్రుల చేతిల్లో ఉంటుంది.

తెలంగాణ వ్యాప్తంగా సర్వే ..

దీంతో వ్యక్తుల ఆరోగ్య వివరాలు తెలియడంతో చికిత్స సులభం అవుతుంది. దీని వల్ల సమయాభావం లేకుండా పేషెంట్లకు చికిత్స అందుతుంది. పేషెంట్ వివరాలను తెలుసుకునేందుకు యూనిక్ ఐడీ నెంబర్ ఎంటర్ చేయగానే.. సదరు వ్యక్తి మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయగానే పేషెంట్ యొక్క పూర్తి వివరాలు తెలియనున్నాయి.  దీని కోసం ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహించాలని యోచిస్తోంది. ఏఎన్ఎంలు, అంగన్వాడీలు ప్రతీ ఇంటికి తిరిగి ప్రజలు ఆరోగ్య వివరాలను నమోదు చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం వీరందరికీ ట్యాబులు ఇవ్వనుంది. వ్యక్తుల ఎత్తు, బరువు, బీపీ, షుగర్, బ్లడ్ గ్రూప్ వంటి వివరాలను పొందు పరుచనున్నారు.