Good News: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..! ఇక అన్నీ ఆ కార్డులోనే..!
Good News: తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలను ఈ హెల్త్ రికార్డ్ పేరిట నమోదు చేయనుంది. దీంతో రాష్ట్రంలోని అందరి ఆరోగ్య వివరాలను సేకరించి రికార్డ్ రూపంలో నమోదుచేయనుంది.
ఇప్పటికే ఈ- హెల్త్ రికార్డ్ కార్డుల కోసం ప్రభుత్వం ఆర్డర్ పెట్టింది. రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తి ఆరోగ్య వివరాలు, వ్యాధులు అన్ని ఈ రికార్డ్ లో నమోదుకానున్నాయి. సుమారు 17 రకాల వివరాలను ఇందులో రికార్డ్ చేయనున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్ వేర్ రూపొందించి.. ఒక్కో వ్యక్తికి ఒక్కో యూనిక్ ఐడీ నెంబర్ ఇవ్వనున్నారు.
ఈ వివరాలను రాష్ట్రంలోని ప్రతీ ఆసుపత్రికి అనుసంధానించనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి టీచింగ్ ఆసుపత్రుల వరకు ఈ వివరాలను అనుసంధానం చేయనున్నారు. దీని వల్ల ప్రతీ ఒక్కరి ఆరోగ్య వివరాలు, వారి హెల్త్ ప్రొఫైల్ మొత్తం ఆసుపత్రుల చేతిల్లో ఉంటుంది.
దీంతో వ్యక్తుల ఆరోగ్య వివరాలు తెలియడంతో చికిత్స సులభం అవుతుంది. దీని వల్ల సమయాభావం లేకుండా పేషెంట్లకు చికిత్స అందుతుంది. పేషెంట్ వివరాలను తెలుసుకునేందుకు యూనిక్ ఐడీ నెంబర్ ఎంటర్ చేయగానే.. సదరు వ్యక్తి మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయగానే పేషెంట్ యొక్క పూర్తి వివరాలు తెలియనున్నాయి. దీని కోసం ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా సర్వే నిర్వహించాలని యోచిస్తోంది. ఏఎన్ఎంలు, అంగన్వాడీలు ప్రతీ ఇంటికి తిరిగి ప్రజలు ఆరోగ్య వివరాలను నమోదు చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం వీరందరికీ ట్యాబులు ఇవ్వనుంది. వ్యక్తుల ఎత్తు, బరువు, బీపీ, షుగర్, బ్లడ్ గ్రూప్ వంటి వివరాలను పొందు పరుచనున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…