రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త..?

భారతీయ రైల్వే ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగం చేయాలనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ద్వారా రైల్వేలో ఉద్యోగాలు చేయాలనుకునే వారి కోసం కొత్త కోర్సులను ప్రకటించింది. https://nrti.edu.in/ వెబ్ సైట్ ద్వారా ఈ కోర్సులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఈ విద్యా సంస్థ ద్వారా రైల్వే శాఖ రైల్వే మౌలిక వసతుల కల్పన కోసం విద్యార్థులకు అవసరమైన శిక్షణను ఇస్తోంది. రైల్వే శాఖ బీబీఏ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్‌మెంట్, బీఎస్సీ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ కోర్సులు మూడేళ్లు, బీటెక్ ఇన్ రైల్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ కోర్సులు నాలుగేళ్ల పాటు చదివే విధంగా కోర్సులను రూపొందించింది.

ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను మాత్రం రైల్వే శాఖ రెండేళ్ల పాటు విద్యార్థులు చదివే విధంగా రూపొందించింది. ఎంఎస్సీ ఇన్ రైల్వే సిస్టమ్స్ ఇంజీరింగ్ అండ్ ఇంటిగ్రేషన్, ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అండ్ అనలిటిక్స్, ఎంఎస్సీ ఇన్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీ అండ్ పాలసీ, ఎంబీఏ ఇన్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజ్‌మెంట్ కోర్సులకు రెండు సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది.

రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిన కొత్త కోర్సులు నిరుద్యోగులకు ప్రయోజనం కలిగించేవిగా ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే శాఖ కొత్త కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తూ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా చేస్తుండటం గమనార్హం