ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఒకటైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ & బైలరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్) కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతోంది. స‌్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. ఐఎల్‌బీఎస్ ఆసక్తి ఉన్న అభ్యర్థులు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
https://www.ilbs.in/?page=hrjobs_listing వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. 29 ఉద్యోగాలలో అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, సీనియర్ రెసిడెంట్, రీడర్ పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు వచ్చే నెల 2వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు ఎంబీబీఎస్, డీఎన్‌బీ, ఎండీ/ ఎంఎస్, డీఎం/ ఎంసీహెచ్ కోర్సులలో పాసై ఉండాలి. అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లకు అధికంగా ప్రాధాన్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాలు కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ కూడా తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. అభ్యర్థులకు పోస్టులకు సంబంధించి పూర్తి సమాచారం వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఒకవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని ఖాళీలను భర్తీ చేస్తుండగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సైతం పోస్టుల భర్తీ చేస్తుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుండటం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…