ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ప్రభుత్వ ఉద్యోగాలు..?

0
230

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఒకటైన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివ‌ర్ & బైల‌రీ సైన్సెస్‌ (ఐఎల్‌బీఎస్‌) కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడుతోంది. స‌్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది. ఐఎల్‌బీఎస్ ఆసక్తి ఉన్న అభ్యర్థులు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.

https://www.ilbs.in/?page=hrjobs_listing వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. 29 ఉద్యోగాలలో అసోసియేట్ ప్రొఫెస‌ర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చ‌ర‌ర్‌, సీనియ‌ర్ రెసిడెంట్, రీడర్ పోస్టులు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు వచ్చే నెల 2వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు ఎంబీబీఎస్‌, డీఎన్‌బీ, ఎండీ/ ఎంఎస్‌, డీఎం/ ఎంసీహెచ్ కోర్సులలో పాసై ఉండాలి. అర్హతతో పాటు అనుభవం ఉన్నవాళ్లకు అధికంగా ప్రాధాన్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాలు కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ కూడా తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. అభ్యర్థులకు పోస్టులకు సంబంధించి పూర్తి సమాచారం వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఒకవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని ఖాళీలను భర్తీ చేస్తుండగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సైతం పోస్టుల భర్తీ చేస్తుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here