దేశ ప్రజలకు బ్రహ్మాండమైన శుభవార్త.. నాలుగు నెలల్లో కరోనా అంతం..?

దేశంలో మార్చి నెల తొలి వారం నుంచి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనే తేడాల్లేకుండా అన్ని రాష్ట్రాలపై ఈ మహమ్మారి ప్రభావం పడింది. శరవేగంగా వ్యాప్తి చెందిన ఈ వైరస్ ప్రజల వెన్నులో వణుకు పుట్టించింది. కోట్ల సంఖ్యలో ప్రజలను ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే భయపడేలా చేసింది. రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఈ వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు.

కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే ఈ వైరస్ ను కట్టడి చేయవచ్చని శాస్త్రవేత్తలు తొలుత భావించారు. అయితే తాజాగా కేంద్రం కరోనా వైరస్ కోసం ఏర్పాటు చేసిన ఒక కమిటీ ప్రజలకు బ్రహ్మాండమైన శుభవార్త చెప్పింది. 2020 ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా వైరస్ పూర్తిగా అంతమవుతుందని తెలిపింది. కేంద్రం నియమించిన కమిటీ కాబట్టి ఒకటికి రెండుసార్లు జాగ్రత్త వహించి ఈ పరిశోధన ఫలితాలను వెల్లడించి ఉంటారు.

మరోవైపు భారత్ లో, తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనం ఫలితాలను నమ్మాల్సి వస్తోంది. దేశంలో కరోనా ఇప్పటికే పీక్ స్టేజ్ ను దాటిందని… అయితే మహమ్మారి అంతం కావాలంటే ప్రజలు కూడా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం చెబుతోంది. ఈ కమిటీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి కోటీ ఐదు లక్షల మంది కరోనా బారిన పడతారని వెల్లడిస్తోంది.

మరోవైపు మరికొన్ని రోజుల్లో చలికాలం మొదలవుతూ ఉండటంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దేశంలో కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పడితే మాత్రమే సాధారణ పరిస్థితులు నెలకొని ప్రజలు సంతోషంగా జీవనం సాగించే అవకాశాలు ఉంటాయి.