తేనె తినేవాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ సమస్యలు గ్యారంటీ..?

మనలో చాలామంది తేనెను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే సహజసిద్ధమైన తేనె లభించదు కాబట్టి అందరూ బ్రాండెడ్ కంపెనీల నుంచి తేనెను కొనుగోలు చేస్తారు. అయితే అలా కొని తేనె తినేవారికి సెంటర్ ఫర్ సైన్స్ షాకింగ్ న్యూస్ చెప్పింది. దేశంలో ప్రముఖ బ్రాండ్లు అన్నీ కల్తీ తేనెను విక్రయిస్తున్నాయని సదరు సంస్థ తేల్చి చెప్పింది. ప్రముఖ బ్రాండ్ల కంపెనీల తేనెలపై పరీక్షలు చేసి ఈ విషయాలను వెల్లడించింది.

అయితే సెంటర్ ఫర్ సైన్స్ నివేదికను తేనెను విక్రయిస్తున్న ప్రముఖ కంపెనీలు అన్నీ ఖండిస్తున్నాయి. నివేదికలో ఎటువంటి వాస్తవం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. నాణ్యతా ప్రమాణాలను అనుసరించి తేనెను విక్రయిస్తున్నా తమ కంపెనీలపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. కల్తీ చేయకుండా స్వచ్చమైన తేనెను మాత్రమే విక్రయిస్తున్నామని ఆరోపణలు చేయడం సరికాదని చెబుతున్నాయి.

పలు కంపెనీలు ఈ నివేదికలో తమ కంపెనీ పేరు ఉన్నా టెన్షన్ పడవద్దని తేనెకు సంబంధించి తమ కంపెనీ పూర్తి హామీ ఇస్తుందని వెల్లడిస్తున్నాయి. సహజంగా తేనెను విక్రయిస్తున్న కంపెనీలను కించపరిచే కుట్ర జరుగుతోందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇతర దేశాల పరిజ్ఞానాన్ని ప్రోత్సహించేందుకు ఇలాంటి కుట్రలు తెరపైకి తెస్తున్నారని ప్రముఖ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి.

ప్రాసెస్ చేసిన తేనెను ప్రోత్సహించేందుకు నివేదికల ద్వారా కుట్ర జరుగుతోందంటూ అభిప్రాయపడుతున్నాయి. ఇలాంటి నివేదికలు దేశంలో తేనె మార్కెట్ ను తగ్గిస్తాయని కంపెనీలు తెలుపుతున్నాయి.