పాలల్లో కల్తీ జరిగిందా.. లేదా అనేది ఎలా తెలుసుకోవాలో తెలుసా?

పాలల్లో వివిధ రకాల పోషకాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. దాదాపు ప్రతీ ఒక్కరు ఏదో రకంగా పాలతో ముడిపడి ఉన్నవాళ్లే.. ఎందుకంటే.. పాలను వినియోగించని మనిషి అంటూ ఎవరూ ఉండరు. పుట్టిన దగ్గర నుంచి ముందుగా అమ్మ పాలు తాగుతాడు.. తర్వాత టీ, కాఫీ లాంటివి తాగే సమయంలో అందులో కూడా పాలు ఉంటాయి.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్తీ మాయ నడుస్తోంది. ఎక్కడ చూసినా నాణ్యమైన సరుకులు గానీ, నాణ్యమైన వస్తువులు కానీ కనిపించడం లేదు. ఆవు, గేదె నుంచి వచ్చే పాలల్లో కూడా కల్తీ రాజ్యం ఏలుతోంది. అయితే మన దగ్గరకు వచ్చిన పాలల్లో కల్తీని ఎలా గుర్తుపట్టాలో చాలామందకి తెలియదు. మనకు ఎందుకులే.. పాలు వచ్చాయా.. ఇంట్లో ఇచ్చామా.. ఛాయ్ తాగామా అన్నట్లే ఉంటున్నారు చాలామంది .

కల్తీపై గళం ఎత్తితే మన ఆరోగ్యాలను కాపాడుకునే వాళ్లం అవుతాం.. కానీ పట్టించుకునే వారు ఉండరు. కల్తీని ఎలా గుర్తు పట్టాలో ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా మన దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ పరిశోధనల బృందం పాలలో కల్తీని గుర్తించగలిగే స్మార్ట్‌ ఫోన్ ఆధారిత సెన్సార్‌లను రూపొందించింది. అదెలా పని చేస్తుందంటే.. మొదట వాళ్లు ఆమ్లతను కొలవాడానికి ఒక కాగితాన్ని వినియోగించారు.

దాని దగ్గరకు వెళ్లి రంగు మార్పును గుర్తించగల ప్రోటోటైప్ స్మార్ట్‌ ఫోన్ – అనుకూల అల్గోరిథంను అభివృద్ధి చేశారు. పాలల్లో ఆ కాగితాన్ని ముంచి బయటకు తీసిన తర్వాత దాని ముందు ఫోన్ కెమెరాను ఉపయోగించి పాలలో సెన్సార్ స్ట్రిప్స్‌ లోని రంగు మార్పును పరిశీలిస్తుంది. దాని ద్వారా వచ్చే పీహెచ్ విలువ ద్వారా పాలల్లోని కల్తీని కనుక్కోవచ్చు.