మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీ జరుగుతున్న నేపథ్యంలో రోజురోజుకు ఎన్నికల సెగ తగులుతోంది అనే చెప్పవచ్చు.ఈ క్రమంలోనే మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ప్రకాష్ రాజ్ మీడియా ఈ సమావేశంలో భాగంగా మంచు విష్ణు ప్యానల్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు.
ఇవాళ మంచు ప్యానెల్ సభ్యులు పోస్టల్ బ్యాలెట్ అర్హత ఉన్న వారందరూ నుంచి సంతకాలు సేకరిస్తోందని ఈ సందర్భంగా ప్రకాష్ మీడియా ఎదుట తెలియజేశారు. పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగం అవుతోందని ఏజెంట్ల ద్వారా మంచు ప్యానల్ పెద్ద కుట్ర చేయడానికి ప్లాన్ వేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.
మా ఎన్నికలలో కేవలం 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉండటం చేత మంచు ప్యానెల్ సభ్యులు కృష్ణ, కృష్ణంరాజు, శారద, పరుచూరి బ్రదర్స్ వాళ్ల పోస్టల్ బ్యాలెట్ డబ్బులు కూడా మోహన్ బాబు మేనేజర్ ఒకే చెక్ రూపంలో కట్టారని ఈ సందర్భంగా మీడియా ముందు తెలియజేశారు.
ఇది మాత్రమే కాకుండా చెన్నై హైదరాబాద్ వంటి పరిసర ప్రాంతాలలో ఉన్న 60 సంవత్సరాలకు పైబడిన వారందరి డబ్బులను కూడా మంచు ప్యానల్ కు సంబంధించిన వ్యక్తులు కట్టారని మరి ఇంత దారుణంగా ఎలక్షన్లు జరపడం అవసరమా అంటూ ప్రకాష్ కొంతవరకు ఎమోషనల్ అయ్యారు. ఈ విషయంపై సినీ పెద్దలైనా కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, మురళీమోహన్ వంటి వారు స్పందించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇన్ని రోజులుగా మేమే గెలుస్తామని మంచి ప్యానెల్ ధీమా వ్యక్తం చేయడంతో ఏం జరుగుతోందని ఆలోచించాను ఇలా డబ్బులతో అందరిని ప్రలోభపెట్టి వారితో సంతకాలు తీసుకున్నారంటూ తెలిపారు. ఈ విషయంపై కచ్చితంగా అధికారులకు ఫిర్యాదు చేస్తామని నమ్మకం నీతి నిజాయితీతోనే ఎలక్షన్లలో పోటీ చేయాలంటూ మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…