నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 56 వేల జీతంతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు..?

ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్‌ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్ల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఏకంగా 56 వేల రూపాయల వేతనం పొందవచ్చు. మొత్తం 235 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. https://careerindianairforce.cdac.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా 2020 సంవత్సరం డిసెంబర్ 30వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలలో ఎయిర్ ఫోర్స్ క్యాట్ ఎంట్రీ పోస్టులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలుగా ఉండగా మిగిలిన విభాగాలను దరఖాస్తు ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లైయింగ్), గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్), ఫ్లైయింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ ఉండటంతో పాటు నిర్దేశించిన శారీరక ప్రమణాలు, ఎన్‌సీసీ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జ‌న‌వ‌రి 1, 2022 నాటికి 24 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఫ్లైయింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు.

మిగిలిన ఉద్యోగాలకు మాత్రం 26 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేయవచ్చు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష , పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ), ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ), మెడికల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.