ఈ ఆకుకూర తినడం వల్ల ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..?

సాధారణంగా మనం తీసుకొనే ఆహారంలో ఏదో ఒక రకమైన పోషకాలు మన శరీరానికి అందుతాయి. అందులో ముఖ్యంగా తాజా కూరగాయలు,, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మన శరీరానికి సరిపడా పోషకాలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ప్రకృతి ప్రసాదించిన ఆకులలో గోంగూర ఒకటని చెప్పవచ్చు. ఈ ఆకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పుల్లటి రుచి కలిగిన ఈ ఆకును తినడానికి ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఈ ఆకును పచ్చడి రూపంలో నిల్వ చేసుకుని తీసుకుంటారు. అయితే ఈ గోంగూరను తినటం వల్ల మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందించడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. గోంగూర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

గోంగూరలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఎక్కువ భాగం ఐరన్, ఫైబర్, క్యాల్షియం, విటమిన్స్ మెండుగా లభిస్తాయి.ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో రక్తం వృద్ధి చెందడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా అధికరక్తపోటు సమస్య నుంచి కాపాడి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.మధుమేహ సమస్యతో బాధపడేవారు తరచూ గోంగూర తీసుకోవడం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను తగ్గించడంలో గోంగూర కీలకపాత్ర పోషిస్తుంది.

గోంగూరలో ఐరన్ క్యాల్షియం సమృద్ధిగా లభించటం వల్ల ఎముకలు పటుత్వాన్ని కోల్పోకుండా దృఢంగా తయారవుతాయి. గోంగూరలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల మన శరీరానికి సరిపడనంత రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అదేవిధంగా విటమిన్ ఏ వల్ల కంటి సమస్యలు దూరం అవడంతో పాటు రేచీకటిని కూడా నియంత్రిస్తుంది.గోంగూర అధిక శాతం ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి జీర్ణక్రియ సమస్యలను దూరం చేయడమే కాకుండా, మలబద్ధకం సమస్యను కూడా తొలగిస్తుంది. మహిళలకు నెలసరి సక్రమంగా రావడానికి కూడా గోంగూర ప్రముఖ పాత్ర పోషిస్తుంది.నిద్రలేమి సమస్యతో బాధపడేవారు తరచూ ఆకుకూరలను తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఇన్ని ప్రయోజనాలు కలిగిన గోంగూరను తరచూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.