Andhra Pradesh: జగనన్న విద్యాదీవెన డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే..!

Andhra Pradesh: జగనన్న విద్యాదీవెన డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే..!

Andhra Pradesh: జగన్ సర్కార్ ప్రవేశ పెడుతున్న ప్రతిష్టాత్మక పథకాల్లో జగన్న విద్యా దీవెన ఒకటి. విద్యార్థులకు బడులకు పంపించే తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకం కింద నగదు జమచేస్తోంది. 

Andhra Pradesh: జగనన్న విద్యాదీవెన డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే..!
Andhra Pradesh: జగనన్న విద్యాదీవెన డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే..!

మార్చిలో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులను ఏపీ ప్రభుత్వం జమ చేయనుంది. అయితే ఈ జగనన్న విద్యా దీవెన వెరిఫికేషన్ పూర్తి కాలేదని… సందేశాలు వచ్చిన విద్యార్థులు వెంటనే తమ గ్రామ సచివాలయాలకు వెళ్లి ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ కు సంబంధించిన డ్యాక్యుమెంట్లను సమర్పించాలి. 

Andhra Pradesh: జగనన్న విద్యాదీవెన డబ్బులు రావాలంటే ఇలా చేయాల్సిందే..!

వెరిఫికేషన్ పూర్తయి ఇన్ఎలిజిబుల్ అయితే.. సచివాలంలోని వెల్ఫేర్ అసిస్టెంట్లను కలవాలి. అర్హత కలిగిన విద్యార్థులు అబ్జెక్షన్ తెలపడానికి ఈనెల 21 వరకు గడువు ఉంది. మార్చిలోగా జగనన్న విద్యా దీవెన డబ్బులు పడకుంటే.. చెక్ చేసుకునే విధానాన్ని కూడా ఏపీ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. 

జ్ఞానభూమి వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు..

విద్యార్థులు జ్ఞానభూమి అనే వెబ్సైట్ ఓపెన్ చేసి స్టూడెం ట్ ఆధార్, పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి. అందులో వ్యూ లేదా ఫ్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అందులో ఏ విద్యా సంవత్సరానికి సంబంధించిన స్టేటస్ తెలుసువాలి అని అనుకుంటున్నారో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మీ స్టేటస్ ఎలిజిబిబుల్ అని ఓటీఏ కంప్లీటెడ్ అని చూపిస్తే మీకు ఇంకా డబ్బులు రాలేదని అర్థం. ఒక వేళ రిలీస్డ్ అని చూపిస్తే మీకు నగదు వచ్చినట్లు అర్థం. టీబీఆర్ నెంబర్ జనరేట్ అయిన వారం రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయ్యే అవకాశం ఉంది.