దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. కర్రలు, ఇనుప రాడ్‌లతో ఇద్దరు మహిళలపై దాడి..!

ఢిల్లీలో కొంతమంది వ్యక్తులు 38 ఏళ్ల మహిళపై కర్రలు, ఇనుప రాడ్‌లతో దారుణంగా దాడి చేశారు. అంతే కాదు ఆమె వెంట ఉన్న తన కూతురుపై కూడా విచక్షణా రహితంగా దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లోని రెసిడెన్షియల్ కాలనీలో గత నెల నవంబర్ 19న ఈ ఘటన చోటుచేసుకుందని అన్నారు.

దాడి చేసిన వాళ్లు.. ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి మద్దతుదారులుగా పేర్కొన్నారు. అధికార పార్టీ కి సంబంధించిన వాళ్లు కాబట్టి వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సదరు మహిళ వాపోయింది. ఆ రోజు గాయపడిన ఆ ఇద్దరు మహిళలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల వాళ్లు డిశ్చార్జి కాగా దాడికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఘటనా ప్రదేశంలో ఉన్న సీసీటీవీని పరిశీలించారు.

ఇద్దరు మహిళల కారు నుంచి దిగగానే కొంతమంది వచ్చి కర్రలతో తన్నడం, కొట్టడం చేశారు. దాడి చేసిన వారిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. దాడి సమయంలో అందులో ఓ మహిళ కారు పక్కకు వెళ్లి.. కాపాడండి అంటూ పెద్దగా కేకలు వేయడంతో వాళ్లు అక్కడ నుంచి పారిపోయారు. ఆప్ ఎమ్మెల్యే బందన కుమారి మద్దతుదారులైన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు తమపై దాడి చేశారని బాధిత మహిళ తన ప్రకటనలో పేర్కొంది.

దాడికి పాల్పడిన మహిళలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ దాడి చేయడానికి గల కారణం ఏంటంటే.. 2019లో ఎమ్మెల్యే భర్తపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినందున ఈ దాడి జరిగింది. నేను చేసిన తప్పులను బయటపెట్టాను. వారిపై గతంలో కూడా అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి” అని ఆ మహిళ తెలిపింది. అయితే అవన్నీ నిరాధారణమైనవి అంటూ తన ఆరోపణలను తిప్పి కోట్టారని చెప్పింది. అప్పటి నుంచి నాపై పగ పెంచుకున్నట్లు ఆరోపించింది. ఈ కారణంగానే తనపై దాడి జరిగిందన్నారు.