విజయ్ దేవరకొండ తమ్ముడుగా దొరసాని సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు హీరో ఆనంద దేవరకొండ. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ వంటి చిత్రాలతో విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్న ఆనంద్ దేవరకొండ పుష్పకవిమానం చిత్రంతో ప్రేక్షకుల సందడి చేశారు. ఈ క్రమంలోనే ఆనంద్ దేవరకొండ మానసా రాధాకృష్ణన్ హీరోహీరోయిన్లుగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై వెంకట్ తలారి ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా నిర్మిస్తున్నారు.
118 చిత్రానికి దర్శకత్వం వహించిన గుహాన్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి
ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ మాట్లాడుతూ ఈ సినిమాకు గుహన్ దర్శకత్వం వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో ఆనంద్ దేవరకొండ మానసా రాధాకృష్ణన్ తో పాటు బాలీవుడ్ నటీనటులు అభిషేక్ బెనర్జీ, సయామిఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మా బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.
ఇక దర్శకుడు గుహన్ మాట్లాడుతూ ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా సాగిపోయే కథ హైవే. ఈ సినిమా పూర్తిగా హైవేలో కొనసాగుతూ ఎంతో అద్భుతంగా వచ్చిందని, ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతో ఆకట్టుకుంటుందని ఈ సందర్భంగా దర్శకుడు వెల్లడించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సైమన్ కె కింగ్ సంగీతం అందించారు. ప్రస్తుతం విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…