ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు టికెట్ టు ఫినాలే అంటూ శుభవార్తను తెలిపారు. ఇక ఈ టాస్క్ లో భాగంగా మూడు రౌండ్లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో మొదటి గేమ్ లో కంటెస్టెంట్ లు అందరూ ఐస్ పై నిలబడి వారి దగ్గర ఉన్న బాల్స్ ను కాపాడుకుంటూ ఇతరుల దగ్గర ఉన్న బాల్స్ లాక్కోవడానికి ప్రయత్నించాలని చెప్పారు. ఇలా కంటెస్టెంట్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది.
ఇకపోతే ఈ టాస్క్ పూర్తి అయిన తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ లందరికీ ఎవరు కూడా వేడినీళ్లతో కాపడం పెట్టుకోకూడదు అని హెచ్చరించాడు.అలా వేడి నీళ్లు పోసుకుంటే ప్రమాదం అని చెప్పడంతో కంటెస్టెంట్ లు కొందరు మెడికల్ రూమ్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అయితే అర్ధరాత్రి సమయంలో శ్రీరామ్ అధిక నొప్పితో బాధ పడుతుంటే పింకీ వెళ్లి పెయిన్ బామ్ రాయడమే కాకుండా వేడి నీళ్ళు తెచ్చి శ్రీరామ్ కాళ్ళకి పోసింది.
దీంతో నొప్పి మరింత అధికం కావడంతో శ్రీ రామ్ మెడికల్ రూమ్ కి వెళ్లారు. అప్పుడు అతని కాళ్లకు బ్యాండేజ్ వేయడంతో అతను నడవలేని పరిస్థితికి వెళ్లారు. అసలే టికెట్ టు ఫినాలే కావడంతో ప్రతి ఒక్క కంటెస్టెంట్ తీవ్రస్థాయిలో పోటీ పడుతుంటే శ్రీరామ్ ఇలా బెడ్ కు మాత్రమే పరిమితం కావడంతో శ్రీ రామ్ ఫాన్స్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొదటిసారి హెచ్చరించిన బిగ్ బాస్ మరోసారి పింకి తన కాళ్లకు వేడి నీళ్ళు పోస్తున్న సమయంలో ఎందుకు హెచ్చరించే లేదు. బిగ్ బాస్ టీమ్ కళ్ళు మూసుకున్నారా..ప్రియాంక అలా చేస్తుంటే మరొకసారి వార్నింగ్ ఇవ్వచ్చు కదా అంటూ శ్రీరామ్ అభిమానులు పెద్ద ఎత్తున బిగ్ బాస్ నిర్వాహకులను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…