రెండు నెలలో 25 కోట్ల వ్యాక్సిన్లు టార్గెట్: కేంద్రం?

ప్రస్తుతం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం అన్ని దేశాలు శరవేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించి కరోనాను కట్టడి చేస్తున్నాయి. కానీ మన దేశంలో జనాభా అధికంగా ఉండి, వ్యాక్సిన్లు కొరత తక్కువగా ఉండటం చేత వాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతోంది. ఈ క్రమంలోనే రెండవదశ భారతదేశంపై పంజా విసిరి ఎంతో మందిని బలితీసుకుంది.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 45 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జూలై చివరి నాటికి దేశ వ్యాప్తంగా 20 నుంచి 25 కోట్ల వ్యాక్సిన్లు పొందేలా టార్గెట్ పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.ఆగస్ట్-సెప్టెంబర్ సమయంలో… అదనంగా మరో 30 కోట్ల వ్యాక్సిన్లను పొందాలనేది కేంద్రం టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మే నెలలో కేంద్ర ప్రభుత్వం 7.9 కోట్ల వ్యాక్సిన్ ను సప్లై చేసింది. ఈ క్రమంలోనే జూన్ నెలలో 6.09 కోట్ల వ్యాక్సిన్లను సరఫరా చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఇండియాలో జనవరి నుంచి మే వరకూ… 5 నెలల్లో 21కోట్ల 31లక్షల 54వేల 129మందికే వ్యాక్సిన్ వేశారు. ఈ క్రమంలోనే కరోనా రెండవ తీవ్రత దేశవ్యాప్తంగా విజృంభించి సృష్టించింది.ప్రస్తుతం పరిస్థితులు కాస్త చెక్కబడి ఉన్న నవంబర్ నెలలో థర్డ్ వేవ్ ముంచుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ వేవ్ వ్యాప్తిచెందే లోపు దేశవ్యాప్తంగా 70 శాతం మంది రెండు డోసులు వ్యాక్సిన్ పూర్తి చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

గడిచిన 5 నెలల్లో 21కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తే… నెక్ట్స్… 5 నెలల్లో 70 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలంటే పెద్ద సవాల్ అని చెప్పవచ్చు.అంచనా వేసినట్లు 2 నెలల్లో 25 కోట్ల వ్యాక్సిన్లు,ఆ తర్వాత 2 నెలల్లో 30 కోట్ల వ్యాక్సిన్లు పొందగలిగితే… 4 నెలల్లో 55 కోట్ల వ్యాక్సిన్లు పొందినట్లవుతుంది. ఈ విధంగా దేశం మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే మనదేశంలో థర్డ్ వేవ్ బలహీనంగా మారుతుందని, లేకపోతే మరొక ప్రమాదం పొంచి ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు.