టెన్త్ పాసైన వాళ్లకు శుభవార్త.. భారీ వేతనంతో 358 ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

‌ ఇండియ‌న్ కోస్ట్ గార్డు పదోతరగతి పాసైన వాళ్లకు శుభవార్త చెప్పింది. నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 358 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం జనవరి 5వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2021 సంవత్సరం జనవరి 19 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.

మొత్తం 358 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా నావిక్ జ‌న‌ర‌ల్ డ్యూటీ ఉద్యోగాలు 260, నావిక్ డొమెస్టిక్ డ్యూటీ 50 ఉద్యోగాలు, యాంత్రిక్ మెకానికల్ 31, యాంత్రిక్ ఎలక్ట్రికల్ 7, యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ 10 ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతల్లో మార్పులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఓసీ, ఓబీసీ అభ్యర్థులు 250 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు https://joinindiancoastguard.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలలో కొన్ని ఉద్యోగాలకు పదో తరగతి అర్హత కాగా మరికొన్ని ఉద్యోగాలకు ఇంటర్ విద్యార్హతగా ఉంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వివిధ దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష, రెండో దశలో ‌ క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, మూడో దశలో మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేస్తే మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హత పొందవచ్చు.