యువతకు అదిరిపోయే శుభవార్త.. నేవీలో భారీ వేతనంతో ఉద్యోగాలు..?

ఇండియ‌న్ నేవీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 210 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మహిళలు, పెళ్లి కాని పురుషుల నుంచి ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్, ప‌ర్మ‌నెంట్ క‌మిష‌న్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది.

ఆన్ లైన్ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పోస్టులను బట్టి వేరువేరు అర్హతలు ఉన్నాయి. మొత్తం 210 ఉద్యోగాలలో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌ ఉద్యోగాలు 122 ఉండగా టెక్నికల్ ఉద్యోగాలు 70, ఎడ్యుకేష‌న్ బ్రాంచ్ ఉద్యోగాలు 18 ఉన్నాయి.

కరోనా విజృంభణ నేపథ్యంలో ఇండియన్ నేవీ పరీక్షలు నిర్వహించకుండా మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తుంది. మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూతో పాటు మెడికల్ పరీక్షలను నిర్వహిస్తారు. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభిస్తుంది.

బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ, బీఎస్సీ, బీకాం, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చదివిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ కేరళలో శిక్షణ ఉంటుంది.