Categories: FeaturedMovie News

104 డిగ్రీల జ్వరం లో మహేష్ బాబు తో కృష్ణ వంశీ ఈ పని చేయించాడా..?

మహేశ్ బాబు హీరోయిన్ గా, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి సినిమా ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. అప్పటివరకూ మాస్ ఇమేజ్ తో ఉన్న మహేశ్ లో కొత్త కోణాన్ని ఆవిష్కరించినటువంటి సినిమా. తెలుగు సినీ చరిత్రలో మురారి సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. మరి ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ సినిమా షూటింగ్ లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఆ ఇంట్రస్టింగ్ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మురారి సినిమాలో గోదావరి ఒడ్డున వచ్చే “డుం డుం డుం నటరాజు ఆడాలి” అనే పాటకి మహేశ్ 104 డిగ్రీల జ్వరంలో డాన్స్ చేశారు. అంతేకాదు వాటర్ ఫైట్ కూడా చేశారు. ఈ సాంగ్ కి, ఫైట్ సీన్ కి అకెలా క్రేన్ అనే ప్రత్యేకమైన పరికరాన్ని వాడారు. ఈ పరికరాన్ని వాడిన రెండో తెలుగు సినిమాగా మురారి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈ సాంగ్ ను, ఫైట్ సీన్ ని కొవ్వూరులోని గోదావరి ఒడ్డున చిత్రీకరించారు. ఈ పాట ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. అయితే ఈ సాంగ్ ను వేటూరితో రాయించుకుదామనుకున్నారు కృష్ణవంశీ. ఆయన పల్లవి వరకూ రాసి మళ్ళీ కనబడలేదట. ఒకరోజు మద్రాస్ లోని మణిశర్మ రికార్డింగ్ స్టూడియోకి అనుకోకుండా వేటూరి వచ్చారట. అప్పుడు కృష్ణవంశీ, ఎలాగైనా పాట రాయాలి అని పట్టుపట్టారట. తర్వాత రాసిస్తాను అని చెప్పినా కృష్ణవంశీ వేటూరిని వదల్లేదట. అక్కడే ఓ చెట్టు కింద కూర్చోబెట్టి వేటూరి లిరిక్స్ చెబుతుంటే, కృష్ణవంశీ రాశారట. అయితే ఈ పాటలో ఖచ్చితంగా అల్లూరి సీతారామరాజు ప్రస్తావన ఉండాలి అని అడిగి మరీ రాయించుకున్నారట. అలా ఆ లిరిక్స్ ను 20 నిమిషాల్లో పూర్తి చేశారట. హేయ్ అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బా తొడగొట్టి చూపించరా అనే లైన్ ఈ సాంగ్ మొదటి చరణంలో వస్తుంది. ఇక చెప్పమ్మా చెప్పమ్మా సాంగ్ లో ఒక షాట్ లో ముగ్గు, సోనాలీ బింద్రేలా మారాలి. దాని కోసం డిజిటల్ ఎడిటింగ్ ను వాడారు.

హాలీవుడ్ మూవీ టెర్మినేటర్ లో జైలు సీన్ లో విలన్ తో చేసిన షాట్ చూసి ఇంప్రెస్ అయిన కృష్ణవంశీ ఆ షాట్ ను మన తెలుగు సాంగ్ లో అప్లై చేశారు. తెలుగులో డిజిటల్ ఎడిటింగ్ చేసిన రెండో సినిమా ఈ మురారి. 65 సంవత్సరాల వయసులో జిక్కీ గారితో అలనాటి రామచంద్రుడు సాంగ్ ఇప్పటికీ ఒక సెన్సేషన్. ఈ సినిమాలో టెంపుల్ సీన్స్ చాలా కీలకమైనవి. మూడు తరాల నేపధ్యానికి సంబంధించిన సీన్స్ అక్కడే తీయాలి. అంటే చాలా పురాతనమైన టెంపుల్ కావాలి. దాని కోసం చాలా ఎంక్వైరీలు చేశారట. చివరకు శంషాబాద్ టెంపుల్ కు ఫిక్సయ్యారు. అలానే ఈ మూవీలో ఏనుగు కావాలంటే ఎక్కడా దొరక్క, కేరళ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇక ఈ సినిమా విప్లవ పాటల రచయితగా ఉన్న సుద్ధాల అశోక్ తేజ్ కు కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాతో ఈయన కెరీర్ మలుపు తిరిగింది.

ఇంటర్నేషనల్ లెవల్ లో ఫైట్ మాస్టర్ గా దూసుకుపోతున్న పీటర్ హెయిన్ కు ఇదే ఫస్ట్ సినిమా. అప్పటివరకూ కనల్ కణ్ణన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. పీటర్ హెయిన్ దూకుడు నచ్చి కృష్ణవంశీ, మహేశ్ లు మురారి సినిమా అవకాశం ఇచ్చారు. అంతే ఒక్క అవకాశంతో ఆయన ఎక్కడికో ఎదిగిపోయారు. హాస్యనటుడు లక్ష్మీపతికి ఇదే తొలి సినిమా. ఈ సినిమా తర్వాత లక్ష్మీపతికి అనేక ఆఫర్లు వచ్చాయి. కమెడియన్ రఘుబాబు, రవిబాబులకు ఈ సినిమా లైఫ్ ఇచ్చింది. ఈ సినిమా తూర్పుగోదావరి జిల్లా పంపిణీ హక్కుల్ని ఎక్కువ మొత్తానికి కృష్ణవంశీ కొనుక్కుని, 40 లక్షల లాభం వెనకేసుకున్నారు. అప్పట్లో అదొక రికార్డు. ఇక ఈ సినిమాను తమిళంలో ఇదే టైటిల్ తో కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ కలిసి డబ్ చేశారు. అక్కడ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఇలా ఈ సినిమా వెనుక ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఏది ఏమైనా మురారి సినిమా మహేశ్ బాబుతో పాటు చాలా మందికి లైఫ్ ఇచ్చిందన్నది వాస్తవం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago