Vanga Geetha: మెగా కుటుంబం పై వంగా గీత సంచలన వ్యాఖ్యలు!

Vanga Geetha: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు పూర్తి అయిన అనంతరం అక్కడక్కడ ఇప్పటికీ అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు నాలుగో తేదీ రాబోతున్న నేపథ్యంలో అందరూ కూడా ఫలితాల పైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికలన్నీ ఒకవైపు అయితే కేవలం పిఠాపురం ఎన్నికల ఫలితాలపై కూడా అదే స్థాయిలో ఆసక్తి నెలకొంది.

పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వంగా గీత ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇక ఇదే నియోజకవర్గంలో నుంచి కూటమి లో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గీత మధ్య భారీ స్థాయిలో పోటీ ఏర్పడగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారని పవన్ అభిమానులు లేదు వంగా గీత గెలుస్తారని వైసిపి అభిమానులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఈ నియోజకవర్గ గెలుపు గురించి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే ఈ ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత మెగా కుటుంబం గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎంతో గౌరవం ఉంది..
ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్లో పాల్గొన్నటువంటి ఈమె మెగా కుటుంబం గురించి మాట్లాడుతూ రాజకీయాల విషయాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా నాకు మెగా కుటుంబంతో చాలా మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఇక వారికి కూడా తనపట్ల చాలా గౌరవం ఉందని ఈమె వెల్లడించారు. అందుకే రాజకీయాల పరంగా నేను ఎక్కడా కూడా మెగా కుటుంబం గురించి వ్యక్తిగత విమర్శలు చేయలేదని ఈ సందర్భంగా వంగా గీత చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.