ఒకే టైటిల్ తో వచ్చిన ఈ తండ్రి కొడుకుల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడాయో మీకు తెలుసా.?!

ఒక సినిమా విజయం విషయంలో కథ తో పాటు ఆ కథకు టైటిల్ కూడా అంతే పాత్రను పోషిస్తుంది. అలా ఒకే టైటిల్ తో వచ్చిన అనేక తెలుగు చిత్రాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, చిరంజీవి సినిమాలు ఒకే టైటిల్ తో(ఆరాధన) వచ్చాయి. అలాగే శోభన్ బాబు, చిరంజీవి (ముగ్గురు మొనగాళ్లు) ఒకే టైటిల్ తో ఉన్న సినిమాలు తీశారు. ఎన్టీ రామారావు, రాజశేఖర్(వేటగాడు) ఒకే టైటిల్ తో ఉన్న సినిమాలో నటించారు.

ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే తయారవుతుంది. ఇకపోతే తండ్రి కొడుకులు ఒకే టైటిల్ తో ఉన్న సినిమాల్లో నటించడం అరుదు. అలా ఎన్టీ రామారావు, బాలకృష్ణ ఒకే టైటిల్ గల సినిమాలో నటించారు. దగ్గుబాటి రామానాయుడు సొంత గ్రామానికి షూటింగ్ నిమిత్తం వచ్చిన నాగేశ్వరరావు సలహా మేరకు ఆయన సినిమా రంగంలో అడుగు పెట్టారు. ఇతర వ్యాపారాలు చేసినప్పటికీ ఆయనకు నచ్చకపోవడంతో శ్రేయోభిలాషుల సలహా మేరకు ఒక సినిమాకి తక్కువ మొత్తంలో ఫైనాన్స్ చేయడం జరిగింది. అందులో నష్టం రావడంతో ఆయన తన బంధువులు, స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకొని మద్రాసు వచ్చారు. సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి.. సినిమాలను నిర్మించడానికి సంసిద్ధులయ్యారు.

అలా ప్రయత్నించగా ఎన్టీరామారావు డేట్స్ దొరకాయి. ఆయనతో 1964లో సురేష్ ప్రొడక్షన్స్, డి.రామానాయుడు నిర్మాణం, తాపీచాణక్య దర్శకత్వంలో రాముడు భీముడు చిత్రం విడుదల అయ్యింది. ఎన్టీ రామారావు, జమున, ఎల్.విజయలక్ష్మి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయం చేసిన మొదటి చిత్రం రాముడు భీముడు. ఈ సినిమా విజయవంతం అవడంతో హిందీలో ‘రామ్ ఔర్ శ్యామ్’ టైటిల్ తో పునర్ణిర్మించడం జరిగింది. అక్కడ విజయం సాధించడంతో.. మళ్లీ హిందీలో తిరిగి ‘సీత ఔర్ గీత’ గా రూపొందించబడింది.

1988 సత్యం సినీ ఎంటర్ప్రైజెస్, సిహెచ్ సత్యనారాయణ నిర్మాణం, మురళీ మోహన్ రావు దర్శకత్వంలో రాముడు భీముడు చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో బాలకృష్ణ, రాధ, సుహాసిని హీరో హీరోయిన్లుగా నటించారు.

1964 లో ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయంలో కనిపించిన ‘రాముడు భీముడు’ చిత్రం విజయవంతమవడంతో… తిరిగి చాలా సంవత్సరాల తర్వాత 1988 లో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రానికి ‘రాముడు భీముడు’ అనే టైటిల్ ని పెట్టడం జరిగింది. ఎన్టీ రామారావు నటించిన రాముడు భీముడు చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలువగా, బాలకృష్ణ నటించిన రాముడు భీముడు చిత్రం హిట్ చిత్రంగా నిలిచింది.