ఈ ఇద్దరు హీరోలలో ఎవరు వెర్రి వెంగళప్ప పాత్రలో జీవించి పోయారో మీకు తెలుసా.?!

సినిమా అనేది జానపద, పౌరాణిక, సాంఘిక కథల సమాహారం. నిర్మాత తను పెట్టిన పెట్టుబడికి తిరిగి ఫలితం పొందాలి అంటే వాణిజ్య చిత్రాలే నిర్మాతల జేబుల్లోకి కాసుల వర్షం కురిపిస్తాయి. హీరోలకు సైతం అలాంటి సినిమాల్లో నటించడం నల్లేరు మీద నడక. కానీ సహజసిద్ధమైన, సృజనాత్మక, పాత్రలో నటించాలంటే హీరోకీ కత్తి మీద సాము లాంటిది. తన ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి కొట్టుమిట్టాడుతున్న సమయంలో కళాత్మక చిత్రాల్లో నటించడం అంత సులువైన విషయం కాదు.

ఒక హీరో అనేక కమర్షియల్ చిత్రాల్లో నటించినా రాని పేరు ఒక కళాత్మక చిత్రంలో నటిస్తే వస్తుంది. అలాంటి అవకాశం కూడా అన్ని సందర్భాల్లో రాదు. నిజజీవితానికి అద్దంపట్టే పాత్రల్లో నటించడం కమల్ హాసన్ కి వెన్నతో పెట్టిన విద్య. ఆ క్రమంలో ఆయన నటించిన వసంత కోకిల, గుణ, విచిత్ర సహోదరులు, సాగర సంగమం, స్వాతిముత్యం చిత్రాలు వస్తాయి.

1985 పూర్ణోదయ మూవీ క్రియేషన్స్, ఏడిద నాగేశ్వరరావు నిర్మాణం, కె.విశ్వనాథ్ దర్శకత్వంలో స్వాతిముత్యం చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో కమల్ హాసన్, రాధిక హీరో, హీరోయిన్లుగా నటించారు. ఒక సాధారణ, సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నప్పటికీ చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో అంధకారమైన ఆమె జీవితంలోకి అమాయకుడైన హీరో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఆమె జీవిత నౌకాగమనం ఎలా సాగిందనేదే చిత్రకథ.

1992 క్రియేటివ్ కమర్షియల్స్, కె.ఎస్.రామారావు నిర్మాణం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చంటి చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్, మీన హీరో హీరోయిన్లుగా నటించారు. తమిళంలో విజయవంతమైన చిన్న తంబి చిత్రాన్ని తెలుగులోకి పునర్నిర్మాణము చేస్తూ కెఎస్ రామారావు నిర్మించిన చిత్రమే చంటి. వెంకటేష్ ఈ చిత్రంలో పోషించిన కల్మషం లేని, అమాయకపు పాత్రలో ఆయన నటించారు. ఊరు జమీందారీ కుటుంబంలో లేకలేక పుట్టిన ఆడపిల్ల హీరోయిన్. గాజుటద్ధముల సున్నితంగా, సుకుమారంగా, ఆప్యాయంగా ఆమె అన్నలు గారాబంగా చూసుకుంటారు.

అలాంటి జమీందారీ కుటుంబంలో కి హీరో వెంకటేష్ పనివాడుగా ప్రవేశిస్తాడు. అభం,శుభం తెలియని అమాయకుడైన హీరోని చూసి మీనా అతనిని ప్రేమిస్తుంది. వారి ప్రేమ చివరికి పెళ్లి వరకు వెళుతుందా లేదా అన్నది మిగతా సినిమా కథ. దర్శకుడు కొన్నికమర్షియల్ హంగులను జోడించడంతో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిజంగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన వెంకటేష్ ఈ తరహా పాత్ర పోషించగలడాని చాలా మంది సినీ ప్రముఖులు సందేహాన్ని వ్యక్తం చేశారు. కానీ అలాంటి విమర్శలను పటాపంచలు చేస్తూ వెంకటేష్ పల్లెటూరి అమాయక పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందాడు.

మానసిక పరిపక్వత లేని పాత్రలో నటించడం అనేది స్వాతిముత్యం కంటే ముందే అలాంటి షేడ్స్ ఉన్న పాత్రలో కమల్ హాసన్ నటించారు. కానీ వెంకటేష్ మాత్రం చంటి సినిమాలో చంటి పాత్రే ఆయన మొదటిసారి పోషించడం జరిగింది. కమలహాసన్, వెంకటేష్ ఇద్దరు కూడా తమదైన శైలిలో అమాయకపు పాత్రలో నటించి ప్రేక్షకుల ప్రశంసలను పొందారు. ఆ విధంగానే ఈ రెండు సినిమాలు కూడా విజయవంతమయ్యాయి.