Naga Chaitanya Mother: నాగచైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విషయాలు తెలుసా.. విడాకులకు కారణం అదేనా?

Naga Chaitanya Mother: నాగార్జున ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత దగ్గుబాటి వారసురాలు దగ్గుబాటి లక్ష్మీని వివాహం చేసుకున్నారు.దగ్గుబాటి రామానాయుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సమయంలోనే లక్ష్మి జన్మించారు. ఈమె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే ఇంటీరియర్ డిజైనర్ గా స్థిరపడ్డారు.ఇకపోతే రామానాయుడు ఇండస్ట్రీలోకి నిర్మాతగా అడుగుపెట్టిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో మంచి పరిచయం ఏర్పడింది.

ఈ విధంగా ఈ రెండు కుటుంబాల మధ్య మంచి పరిచయం ఏర్పడటంతో వీరిద్దరూ వియ్యంకులుగా మారాలని భావించారు.ఇలా అనుకున్నదే తడవు దగ్గుబాటి రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మీతో నాగార్జున వివాహానికి అన్ని సిద్ధం చేశారు. అయితే అమెరికా జీవన శైలికి అలవాటు పడిన లక్ష్మి ఇండియా రావడానికి ఇష్టపడలేదు. అయితే ఆమెకు నచ్చజెప్పి ఇండియా రప్పించి వీరి వివాహాన్ని చెన్నైలో ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు.

ఇకపోతే వివాహమైన తర్వాత లక్ష్మి ఇండియాలో ఇమడలేకపోయింది దీంతో తాను అమెరికా వెళ్లి స్థిరపడాలని నాగార్జునపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే నాగార్జున ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా రాణించాలనే ఉద్దేశంతో తాను అమెరికా వెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.వీరి మధ్య గొడవలు జరగడంతో ఇరు కుటుంబ సభ్యులు వీరికి నచ్చ చెప్పారు.

ఇండియాలో ఉండలేక గొడవలు పడి విడిపోయిన లక్ష్మి..

ఇక ఈ దంపతులకు నాగచైతన్య జన్మించకా లక్ష్మి ఇండియాలో ఉండలేక నాగార్జునతో గొడవలు పడి విడాకులు తీసుకుని విడిపోయారు.విడాకులు ఇచ్చిన తర్వాత నాగార్జునకు అమల పరిచయం కాగా ఆమెతో ప్రేమలో పడి తనని వివాహం చేసుకున్నారు. అదేవిధంగా లక్ష్మీ సైతం తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని తిరిగి అమెరికాలో స్థిరపడ్డారు.ఇక నాగచైతన్య కొద్దిరోజుల పాటు తన తల్లి లక్ష్మీ వద్ద పెరిగినా అనంతరం తండ్రి నాగార్జున దగ్గర కూడా పెరిగారు.