Tag Archives: akhil

Akhil: తారక సింహారెడ్డిగా అఖిల్.. సైలెంట్ గా పని కానిస్తున్న అఖిల్!

Akhil: అఖిల్ అక్కినేని హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించారు. ఇలా అఖిల్ ఇప్పటివరకు పలు సినిమాలలో నటించిన ఈయనకి మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని చెప్పాలి. ఇలా ఎన్నో అంచనాల నడుమ అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయింది దీంతో అఖిల్ పూర్తిగా సైలెంట్ అయ్యారు.

ఇలా అఖిల్ తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారని తెలిసినప్పటికీ ఈయన ఎవరి డైరెక్షన్లో ఏ నేపథ్యంలో రాబోతున్న సినిమాలో చేస్తున్నారనే విషయాలు మాత్రం క్లారిటీ లేదు. అయితే అఖిల్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాహో సినిమాకు డైరెక్షన్ విభాగంలో పనిచేసిన అనిల్ కుమార్ అనే దర్శకుడు అఖిల్ కోసం ఒక భారీ కథను సెట్ చేశాడని, పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను యూవీ సంస్థ నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైందని తెలుస్తుంది.

యుద్ధ వీరుడిగా అఖిల్…

మహారాష్ట్రలోని ఓ ఫారెస్ట్ సైలెంట్ గా ఈ సినిమా జరుగుతోందని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాలో అఖిల్ ధీర అనే యుద్ధవీరుడి పాత్రలో కనిపిస్తాడని, ఈ సినిమాకు తారకసింహారెడ్డి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని సమాచారం ఇలా ఏ విషయాన్ని అధికారకంగా తెలియజేయకుండా అఖిల్ సైలెంట్ గా సినిమా పనులను పూర్తి చేస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.

Priyanka singh: అమ్మాయిగా మారాలనుకుంటే ముందు ఆ పని చేయండి.. ప్రియాంక సింగ్ కామెంట్స్ వైరల్!

Priyanka singh: ప్రియాంక సింగ్ పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కార్యక్రమంలో సాయిగా అందరికీ ఎంత సుపరిచితమైనటువంటి ప్రియాంక జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎక్కువగా లేడీ గెటప్స్ వేసేవారు. ఇలా లేడి గెటప్స్ వేసినటువంటి ఈయన అనంతరం సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిపోయి సాయి కాస్త ప్రియాంక సింగ్ గా మారారు.

ఇలా ప్రియాంక సింగ్ గా మారిన తర్వాత ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా సుమారు 12 వారాలు పాటు హౌస్ లో కొనసాగినటువంటి ప్రియాంక సింగ్ బయటకు వచ్చిన తర్వాత కెరియర్ పరంగా సక్సెస్ అందుకోవడం కోసం పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. తాజాగా ఈమె యూట్యూబర్ నిఖిల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూలో భాగంగా తన జీవితం గురించి ఎన్నో విషయాలు తెలిపారు. నాకు చిన్నప్పటినుంచే అమ్మాయి లక్షణాలు తనలో ఎక్కువగా ఉండటంతో తాను అమ్మాయిగా మారిపోయానని తెలిపారు. అయితే అబ్బాయిలు అమ్మాయిగా ఎవరైతే మారిపోవాలనుకుంటున్నారో అలాంటి వారు ముందుగా హార్మోన్ థెరపీ తీసుకోవాలని తెలిపారు. ఇక నేను అమ్మాయిగా మారడంతో ఎంతోమంది ఎన్నో మాటలు అనేవాళ్ళు ఆ మాటలనే ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అన్నారని ప్రియాంక తెలిపారు.

మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించా…

ఇలా ఇంట్లో వాళ్ళే నన్ను అపార్థం చేసుకోవడంతో తాను ఏకంగా మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేశానని కానీ బ్రతకడంతో నేనేదో సాధించాలని అప్పుడే అర్థమైందంటూ ఈమె తెలిపారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో తన గురించి బ్యాడ్ కామెంట్స్ చేసిన వారిపై ఈమె ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి కూడా మాట్లాడుతూ కామెంట్ చేయడానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది కానీ చాలామంది లైన్ క్రాస్ చేసి కామెంట్ చేయడంతోనే తాను సీరియస్ అయ్యానని ప్రియాంక తెలిపారు.

Niharika: సిసింద్రీ సినిమాలో అఖిల్ బదులు నేనే నటించాల్సి ఉండేది: నిహారిక

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. మెగా డాటర్ గా గుర్తింపు పొందినటువంటి ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి యాంకర్ గాను హీరోయిన్ గాను సందడి చేశారు. అనంతరం పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు అయితే వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు నిహారిక ఉండలేకపోయారు. దీంతో తన భర్తతో విడాకులు తీసుకొని ఈమె విడిపోయారు.

ఇలా తన భర్త నుంచి విడిపోయిన అనంతరం కెరియర్ పై ఎంతో ఫోకస్ పెట్టినటువంటి నిహారిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మొదటిసారి తన వృత్తి పరమైన వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా తెలియజేశారు. ఈ క్రమంలోనే సిసింద్రీ సినిమా గురించి నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను 1993లో జన్మించానని తెలిపారు. నాన్నకు ఆడపిల్ల పుట్టాలని చాలా కోరికగా ఉండేది ముందుగా అన్నయ్య పుట్టడంతో ఈసారి తప్పకుండా కూతురే పుడుతుందని భావించారు. అయితే నేను అపోలో హాస్పిటల్లో జన్మించానని నేను జన్మించే సమయానికి నాన్న ముగ్గురు మొనగాళ్లు సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ షూటింగ్ లొకేషన్ లో ఉన్నారు. పాప పుట్టిందని తెలియగానే నాన్న పెదనాన్న ఇద్దరు షూటింగ్ లోకేషన్ నుంచి హాస్పిటల్ కి వచ్చారని నిహారిక తెలిపారు.

8 నెలలకే నడిచే దాన్ని..

ఇక నేను పుట్టినప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉండే దానిని ఎనిమిది నెలలకే నడవడం మొదలుపెట్టాను అయితే సిసింద్రీ సినిమా కోసం పాకుతూ ఉండే చిన్నారి కావాలని నన్ను కూడా సంప్రదించారు కానీ నేను నడుస్తూ ఉండడంతో నా బదులు ఈ సినిమాలో అఖిల్ నటించారంటూ నిహారిక ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Akhil: గాయాలు పాలైన అఖిల్ అక్కినేని.. చేతికి ఏమైందంటూ ఆందోళనలో ఫ్యాన్స్!

Akhil: టాలీవుడ్ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి నాగార్జున వారసుడు అఖిల్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అఖిల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన ఇప్పటివరకు ఏ సినిమా ద్వారా కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.
ఇటీవల ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే అఖిల్ తదుపరి చిత్రం యువీ క్రియేషన్ బ్యానర్ లో చేస్తున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన లేదు. తాజాగా అఖిల్ సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో కనిపించారు.

ఈయన ఈ కార్యక్రమంలో కనిపించినప్పటికీ ఎడమ చేతికి పెద్ద ఎత్తున బ్యాండేజ్ కట్టుకొని కనిపించారు. దీంతో ఒక్కసారిగా అభిమానులు అసలు అఖిల్ కి ఏమైంది ఎందుకు చేతికి బ్యాండేజ్ కట్టారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈయన చేతికి ఉన్న బ్యాండేజ్ కనుక చూస్తే గాయం పెద్దగా తగిలిందని అర్థమవుతుంది.

పెద్ద గాయమే తగిలింది..

అఖిల్ రహస్యంగా సినిమా షూటింగ్లో కనుక బిజీగా ఉంటూ గాయాల పాలయ్యారా లేకపోతే ఆయనకు ఏం జరిగిందనే విషయాల గురించి తెలియక అభిమానులు కంగారుపడుతున్నారు. మరి అఖిల్ కు నిజంగానే ఏం జరిగిందనే విషయాలు తెలియాలి అంటే  ఈ విషయం గురించి స్వయంగా అఖిల్ స్పందించాల్సి ఉంది. అదేవిధంగా అఖిల్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కోసం కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Ntr:ఎన్టీఆర్ మీద కూర్చున్న ఈ కుర్రాడిని గుర్తుపట్టారా.. టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో తెలుసా?

Ntr: ఒకప్పుడు సోషల్ మీడియా లేకపోవడం వల్ల సినిమాలకు సంబంధించిన విషయాలు లేదా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు తెలియాలి అంటే కేవలం సినీ వారపత్రికలో మాత్రమే తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాలలో అభిమానులకు తెలిసిపోతుంది. సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలందరూ కూడా వారికి సంబంధించిన విషయాలతో పాటు వారి చిన్నప్పటి విషయాలను కూడా అందరితో పంచుకుంటూ ఉన్నారు.

ఈ క్రమంలోనే సెలబ్రిటీల ఓల్డ్ ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఎన్టీఆర్ మీద ఒక కుర్రాడు కూర్చొని ఉన్నటువంటి ఫోటో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు అయితే ఆ హీరో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా కొనసాగుతున్నారు.

మరి ఎన్టీఆర్ దగ్గర కూర్చుని ఉన్నటువంటి ఆ కుర్రాడిని ఎవరో గుర్తుపట్టారా… మన అక్కినేని వారసుడు అఖిల్. ఎన్టీఆర్ దగ్గర ఎంతో చనువుగా కూర్చుని ఉన్నటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇటు ఎన్టీఆర్ అభిమానులు అటు అక్కినేని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటో చూసినటువంటి అభిమానులు అఖిల్ చిన్నప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తారక్ తో అఖిల్..


ఇక అఖిల్ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు అఖిల్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈయన మొదటి సినిమాతో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. అయితే ఈయన కెరియర్ లో ఇప్పటివరకు నటించిన సినిమాలేవి కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదని చెప్పాలి. చివరిగా అఖిల్ ఏజెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

Nagarjuna: నాగార్జునకు కోపం వస్తే అలాంటి పని చేస్తారా… నాగార్జున సీక్రెట్ బయటపెట్టిన అఖిల్!

Nagarjuna: టాలీవుడ్ నటు సామ్రాట్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మన్మధుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతో మంది మహిళ అభిమానులను సొంతం చేసుకున్నారు.. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఇప్పటికి పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.ఇక నాగార్జునను మనం ఎలాంటి పరిస్థితులలో చూసిన ఆయన మొహంపై చిరునవ్వు ప్రశాంతత మాత్రమే కనబడుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా తాను సీరియస్ గా అయినటువంటి సందర్భాలను కూడా మనం చూడలేదు.ఇలా ఎప్పుడు సరదాగా ఉండే నాగార్జునకు కోపం వస్తే ఊహించని విధంగా రియాక్ట్ అవుతారని తెలుస్తుంది.

ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే నాగార్జునకు కూడా కోపం వస్తుందా అన్న సందేహాలను నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన కూడా మనిషే కదా తనకు కూడా కోపం వస్తుందని ఆ కోపం వస్తే నాగార్జున ఏం చేస్తారో అనే విషయాలను ఒకానొక సందర్భంలో అఖిల్ బయట పెట్టారు.ఈ సందర్భంగా అఖిల్ తన తండ్రి కోపం గురించి మాట్లాడుతూ నాన్నకు కోపం వస్తే ఆయన వెంటనే కిచెన్లోకి వెళ్లిపోతారని తెలిపారు.

Nagarjuna: నాన్నకు కోపం వస్తే వంట వండుతారు..

ఇలా కిచెన్ లోకి వెళ్లి వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తారని నాన్న చాలా అద్భుతంగా కుకింగ్ చేస్తారు అంటూ అఖిల్ తెలియజేశారు. ఇక తాను ఎప్పుడైనా షూటింగ్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి నాన్న కిచెన్ లో ఉన్నారు అంటే ఇంట్లో ఏదో జరిగిందని అందుకే నాన్న సీరియస్ గా ఉన్నారని తనకు అర్థమయ్యే కొంత సమయం పాటు నాన్నతో ఏమీ మాట్లాడమని ఈ సందర్భంగా తెలియజేశారు.

Akhil: అఖిల్ కోసం రంగంలోకి దిగిన శ్రీకాంత్ అడ్డాల… ఈసారైనా హిట్ కొట్టేరా?

Akhil: అఖిల్ అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఎంతో టాలెంటెడ్ డైరెక్టర్లతో కలిసి పనిచేశారు అయితే ఇప్పటివరకు ఐదు సినిమాలలో నటించినా ఏ ఒక్క సినిమా కూడా ఈయనకు సక్సెస్ అందించలేదని చెప్పాలి. ఇలా ఒక సినిమా కూడా సక్సెస్ కావడంతో ఈయన ఇండస్ట్రీలో పనికిరారని వేరే రంగంలో స్థిరపడితే మంచిదంటూ కూడా పలువురు భావించారు.

ఇలా ఐదు సినిమాలలో అఖిల్ నటించినప్పటికీ ఇందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే పరవాలేదు అనిపించుకుంది ఇక తాజాగా ఏజెంట్ సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా భారీ డిజాస్టర్ అందుకుంది. ఇలా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో అఖిల్ కెరియర్ ఇంతటితో సమాప్తం అని అందరూ భావించారు.

ఇకపోతే అఖిల్ ఎలాగైనా సక్సెస్ అందించాలని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల రంగంలోకి దిగబోతున్నారని తెలుస్తుంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ సినిమాలను తెరకెక్కించే శ్రీకాంత్ అడ్డాల అఖిల్ కోసం మాస్ యాక్షన్ కథని సిద్ధం చేశారని. ఈ సినిమాని ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా అఖిల్ కు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందించలేకపోయారు.

Akhil: శ్రీకాంత్ అయినా అఖిల్ ను నిలబెట్టేనా…


ఈ క్రమంలోనే డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల అయిన అఖిల్ కు ఒక హిట్ ఇచ్చి తనని ఇండస్ట్రీలో నిలబెడతారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా కనుక హిట్ కాకపోతే ఈయన ఇండస్ట్రీకి దూరం కావడమే మంచిదని ఇండస్ట్రీ ఈయనకు సెట్ అవ్వలేదని చెప్పాలి మరి శ్రీకాంత్ అడ్డాల అఖిల్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా సక్సెస్ అందుకునేనా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Akhil: ఏజెంట్ డిజాస్టర్ గురించి మొదటిసారిగా స్పందించిన అక్కినేని అఖిల్..?

Akhil: అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు అఖిల్ నటించిన సినిమాలలో ఒక్కటి కూడా మంచి విజయం అందుకోలేకపోయాయి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఏజెంట్ సినిమా కూడా అక్కినేని కుటుంబ సభ్యులను , అభిమానులను నిరాశపరిచింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలై అందరూ అంచనాలను తారుమారు చేసింది. ఈ సినిమాతో అఖిల్ అకౌంట్లో మరొక డిజాస్టర్ వచ్చి చేరింది. ఇదిలా ఉండగా ఏజెంట్ సినిమా డిజాస్టర్ గురించి తాజాగా అఖిల్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అఖిల్ షేర్ చేసిన ఈ నోట్ లో ” ఏజెంట్ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా తెరకెక్కించడంలో తమ జీవితాలను అంకితం చేసిన వారికి కూడా కృతజ్ఞతలు. ఒక మంచి సినిమా అందించాలని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము. కానీ దురృష్టవశాత్తు మేము అనుకున్న స్థాయికి స్క్రీన్ పైకి తీసుకురాలేకపోయాం. ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని ఇవ్వలేకపోయాం అంటూ రాసుకొచ్చాడు.

Akhil: మంచి సినిమాని ఇవ్వలేకపోయాం..


అలాగే మూవీ మొదలు పెట్టిన్పటి నుంచి నాకు ఎంతో అండగా నిలిచిన నిర్మాత అనీల్ కు నా కృతజ్ఞతలు. అభిమానులు, శ్రేయోభిలాషులు చూపించే ప్రేమ , అభిమానం వల్లే నేను ఇప్పటికీ కష్టపడి పనిచేస్తున్నా. నాపై నమ్మకం పెట్టుకున్న అభిమానుల కోసం నేను మరింత దూరంగా సిద్ధమై ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తాను అంటూ నోట్ లో తెలియపరిచాడు. ప్రస్తుతం అఖిల్ షేర్ చేసిన ఈ నోట్ వైరల్ గా మారింది. అయితే అక్కినేని అభిమానులు కూడా అఖిల్ కి ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.

AGENT Twitter Review : అఖిల్ అక్కినేని “ఏజెంట్” మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందో తెలుసా?

Akhil: అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ఏజెంట్. స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఈరోజు (ఏప్రిల్ 28వ తేదీ)న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక మాస్ ఇమేజ్ కోసం మొదటి సినిమా నుండి ట్రై చేస్తున్నాడు అఖిల్. ఈ నేపథ్యంలో మొదటి సినిమా “అఖిల్” డైరెక్టర్ వివి వినాయక్ తో గ్రాండ్ లాంచ్ చేసినా ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తరువాత “హలో”, మిస్టర్ మజ్ను సినిమాలు చేసినా అవి కూడా అంతంత మాత్రంగా ఆడాయి. ఈ రెండు సినిమాలు లవ్ బాయ్ ఇమేజ్ కొంచెం ఇచ్చినా.. అయన మాత్రం మాస్ ఇమేజ్ కోసమే ట్రై చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో తాజగా డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి స్పై త్రిల్లర్ ఏజెంట్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మళయాళ నటుడు మమ్ముట్టి నటించడం మరో విశేషం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా కొత్త అమ్మాయి సాక్షి వైద్య పరిచయం అవుతుంది. “బాస్ పార్టీ” ఫెమ్ ఊర్వశి రహతుల తో ఒక ఐటెం సాంగ్ కూడా చేశారు. ఇప్పటికె విడుదలైన పాటలు, ట్రైలర్స్ ఈ సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. అయితే భారీ అంచనాల నడుమ ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్ తో పలు చోట్ల ఫస్ట్ డే షోలు పడిపోయాయి. ఇక ఈ సినిమా చూసిన పలువురు ప్రేక్షకులు ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేస్తున్నారు, మరి ఎలా ఉందొ ఒకసారి చూసేద్దామా ?

ఈ సినిమా గురించి ట్విట్టర్ లో మిశ్రమ స్పందన వస్తుంది. అఖిల్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని, కానీ అసలు సినిమాలో కథ సరిగా లేదని అంటున్నారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పాటలు అసలు బాలేదని, ఎందుకు పెట్టార్రా బాబు అనిపిస్తున్నాయని అంటున్నారు. అసలు లవ్ ట్రాక్, హీరోయిన్ అస్సలు ఏమి ఉపయోగం లేదని అంటున్నారు. కొందరు ఫస్ట్ హాఫ్ ఓకే అని.. సెకండ్ హాఫ్ అస్సలు బాలేదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అయితే అఖిల్ వన్ మెన్ షో చేసాడని సినిమా మొత్తం అఖిల్ తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడని అంటున్నారు.

Nagarjuna -Amala: శ్రీవారి సన్నిధిలో నాగార్జున దంపతులు… కొడుకుల సినిమాల హిట్ కోసమే వచ్చామంటూ కామెంట్స్!

Nagarjuna -Amala: టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అమల, నాగార్జున ఇద్దరు కలిసి బుధవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం తరువాత ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.

ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన నాగార్జున, అమల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. .ఇదిలా ఉండగా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో నాగార్జున మాట్లాడుతూ… ఏడాది తర్వాత సతీసమేతంగా ఇలా శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. అంతేకాకుండా నాగార్జున తన కొడుకులు అక్కినేని అఖిల్ అక్కినేని నాగచైతన్య గురించి కూడా మాట్లాడుతూ..త్వరలోనే మా అబ్బాయిలు నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయి.

ఇద్దరూ చాలా కష్టపడి సినిమాలు చేశారు. కేవలం కష్టం ఒక్కటే కాదని.. శ్రీవారి ఆశీస్సులు కూడా ఉండాలని స్వామివారి దర్శనార్థం వచ్చాము అని నాగార్జున తెలిపాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అఖిల్ ‘ ఏజెంట్ ‘ సినిమా ద్వారా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అలాగే మరొకవైపు అక్కినేని నాగచైతన్య కూడా ‘ కస్టడీ ‘ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.

Nagarjuna -Amala: కష్టం ఒకటే కాదు శ్రీవారి ఆశీస్సులు కావాలి…

గతంలో విడుదలైన థాంక్యూ సినిమా నాగచైతన్యకు నిరాశ మిగిల్చింది. దీంతో ప్రస్తుతం కస్టడీ సినిమా మీద నాగచైతన్య ఆశలు పెట్టుకున్నాడు. ఇక అఖిల్ కూడా తాను నటించిన ఏజెంట్ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇదిలా ఉండగా ‘ ది ఘోస్ట్ ‘ సినిమా ద్వారా నాగార్జునకి కూడా పరాజయం ఎదురయ్యింది. ఇక ప్రస్తుతం తమిళ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని సమాచారం.