Akhil: అఖిల్ అక్కినేని హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించారు. ఇలా అఖిల్ ఇప్పటివరకు పలు సినిమాలలో నటించిన ఈయనకి మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని చెప్పాలి. ఇలా ఎన్నో అంచనాల నడుమ అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోయింది దీంతో అఖిల్ పూర్తిగా సైలెంట్ అయ్యారు.
ఇలా అఖిల్ తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారని తెలిసినప్పటికీ ఈయన ఎవరి డైరెక్షన్లో ఏ నేపథ్యంలో రాబోతున్న సినిమాలో చేస్తున్నారనే విషయాలు మాత్రం క్లారిటీ లేదు. అయితే అఖిల్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాహో సినిమాకు డైరెక్షన్ విభాగంలో పనిచేసిన అనిల్ కుమార్ అనే దర్శకుడు అఖిల్ కోసం ఒక భారీ కథను సెట్ చేశాడని, పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాను యూవీ సంస్థ నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైందని తెలుస్తుంది.
యుద్ధ వీరుడిగా అఖిల్…
మహారాష్ట్రలోని ఓ ఫారెస్ట్ సైలెంట్ గా ఈ సినిమా జరుగుతోందని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ సినిమాలో అఖిల్ ధీర అనే యుద్ధవీరుడి పాత్రలో కనిపిస్తాడని, ఈ సినిమాకు తారకసింహారెడ్డి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని సమాచారం ఇలా ఏ విషయాన్ని అధికారకంగా తెలియజేయకుండా అఖిల్ సైలెంట్ గా సినిమా పనులను పూర్తి చేస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…