Movie News

Naresh: నన్ను చూస్తే అబ్బాయిలు కూడా కన్ను కొడతారు.. నరేష్ బోల్డ్ కామెంట్స్ వైరల్!

Naresh: వీకే నరేష్ పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నరేష్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో ఈయన తన వ్యక్తిగత విషయాలు ద్వారా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే.

తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చినటువంటి నరేష్ ప్రస్తుతం సినీనటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉన్నారు ఈ విషయంపై తన మూడో భార్య రమ్య రఘుపతి తీవ్ర స్థాయిలో వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంతా సర్దుకుపోయిందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈయన గోపీచంద్ హీరోగా హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన బీమా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నరేష్ మాట్లాడుతూ యువతలో చాలా ఉత్సాహాన్ని నింపారు. ఇక ఈ సినిమాలో తన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని తన పాత్ర గురించి నరేష్ చెప్పుకువచ్చారు. ఎలాంటి పాత్రలు చేయాలి అన్న సందిగ్ధంలో ఉన్న నాకు హర్ష విభిన్నమైనటువంటి పాత్ర వినిపించారని ఈ పాత్ర వినగానే వెంటనే ఓకే చెప్పానని తెలిపారు.

నా పాత్ర చూస్తే కన్ను కొడతారు..
ఇకపోతే ఈ సినిమాలో తన పాత్రను కనుక చూస్తే అబ్బాయిలు మీరందరూ కూడా నాకు కన్ను కొడతారు అంటూ ఈయన బోల్డ్ కామెంట్స్ చేశారు. అంత అద్భుతంగా నా పాత్రను తీర్చిదిద్దారు అంటూ ఈ సందర్భంగా నరేష్ బీమా సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఆల్ రౌండర్ అని ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని ఈయన తెలియజేశారు. ఇక ఈ సినిమా మార్చి 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago