Akira: అకిరా నందన్ పరిచయం అవసరం లేని పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడిగా అందరికీ ఎంతో సుపరిచితమే ప్రస్తుతం ఈయన తన తల్లి రేణు దేశాయ్ వద్దంటున్నారు. ఏదైనా పండగల సమయంలో మెగా ఫ్యామిలీతో కలిసి రచ్చ చేస్తూ ఉంటారు. ఇక రేణు దేశాయ్ తన పిల్లలకు సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
తాజాగా రేణు దేశాయ్ అకిరాకు సంబంధించిన ఒక హ్యాండ్సం పిక్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెడ్ కలర్ షర్టులో ఈయన హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నటువంటి ఫోటోని రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు జూనియర్ పవన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇలా తన కొడుకు ఫోటోని షేర్ చేసినటువంటి ఈమె తాను తన పిల్లలకు ఒక విషయాన్ని చెప్పానని తన పిల్లలు అదే పాటిస్తున్నారని చెప్పుకు వచ్చారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వైర్లెస్ ట్రెండి బ్లూటూత్ వాడుతున్నారు. వీటిని వాడటం వల్ల బ్రెయిన్ చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుందని అందుకే వైర్ హెడ్ ఫోన్స్ వాడమని తన పిల్లలకు సలహా ఇచ్చానని వాళ్ళు అదే చేస్తున్నారు అంటూ ఈమె తెలియజేశారు.
అమ్మ మాటే శాసనం..
ఈ క్రమంలోనే అకిరా ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ ఫోటోలలో అకిరా అచ్చం యంగ్ ఏజ్ లో పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఉన్నారో తను కూడా అలాగే కనిపిస్తూ ఉండడంతో మెగా ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అకిరా ఇండస్ట్రీలోకి కనక వస్తే తండ్రిని మించిన తనయుడు అవుతారని , అకిరా సినీ ఎంట్రీ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి అభిమానులకు అకిరా ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారో తెలియాల్సి ఉంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…