Movie News

Akhil: ఏజెంట్ డిజాస్టర్ గురించి మొదటిసారిగా స్పందించిన అక్కినేని అఖిల్..?

Akhil: అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటివరకు సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. ఇప్పటివరకు అఖిల్ నటించిన సినిమాలలో ఒక్కటి కూడా మంచి విజయం అందుకోలేకపోయాయి. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఏజెంట్ సినిమా కూడా అక్కినేని కుటుంబ సభ్యులను , అభిమానులను నిరాశపరిచింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలై అందరూ అంచనాలను తారుమారు చేసింది. ఈ సినిమాతో అఖిల్ అకౌంట్లో మరొక డిజాస్టర్ వచ్చి చేరింది. ఇదిలా ఉండగా ఏజెంట్ సినిమా డిజాస్టర్ గురించి తాజాగా అఖిల్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అఖిల్ షేర్ చేసిన ఈ నోట్ లో ” ఏజెంట్ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా తెరకెక్కించడంలో తమ జీవితాలను అంకితం చేసిన వారికి కూడా కృతజ్ఞతలు. ఒక మంచి సినిమా అందించాలని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము. కానీ దురృష్టవశాత్తు మేము అనుకున్న స్థాయికి స్క్రీన్ పైకి తీసుకురాలేకపోయాం. ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని ఇవ్వలేకపోయాం అంటూ రాసుకొచ్చాడు.

Akhil: మంచి సినిమాని ఇవ్వలేకపోయాం..


అలాగే మూవీ మొదలు పెట్టిన్పటి నుంచి నాకు ఎంతో అండగా నిలిచిన నిర్మాత అనీల్ కు నా కృతజ్ఞతలు. అభిమానులు, శ్రేయోభిలాషులు చూపించే ప్రేమ , అభిమానం వల్లే నేను ఇప్పటికీ కష్టపడి పనిచేస్తున్నా. నాపై నమ్మకం పెట్టుకున్న అభిమానుల కోసం నేను మరింత దూరంగా సిద్ధమై ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తాను అంటూ నోట్ లో తెలియపరిచాడు. ప్రస్తుతం అఖిల్ షేర్ చేసిన ఈ నోట్ వైరల్ గా మారింది. అయితే అక్కినేని అభిమానులు కూడా అఖిల్ కి ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago