Movie News

Naresh: అందరూ చూస్తుండగానే ప్రియురాలి పై ముద్దుల వర్షం కురిపించిన నరేష్?

Naresh: ప్రముఖ నటుడు వికే నరేష్, పవిత్రా లోకేశ్ ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో నరేష్ మూడో భార్య వీరిపై విరుచుకుపడింది. ఈ క్రమంలో నరేష్ రమ్య రఘుపతి పవిత్ర లోకేష్ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారారు. ఇక ఇప్పుడు నరేశ్, పవిత్రా లోకేశ్ ప్రధాన పాత్రలలో ‘ మళ్ళీ పెళ్ళి ‘ అనే సినిమాలో నటించారు.

నరేష్ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి.
ఈ క్రమంలో నరేష్, పవిత్ర లోకేష్ జంటగా సినిమా ప్రమోట్ చేసే బాధ్యతను తీసుకున్నారు. బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షో లతో పాటు ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ రియాలిటీ షోలో సందడి చేశారు.

ఇక ఈ షోలో నరేష్, పవిత్ర లోకేష్ సినిమా గురించి అనేక విషయాలను వెల్లడించారు. ఇక ఈ షోలో పవిత్రని ముద్దుగా ఏమని పిలుచుకుంటారో నరేష్ చెప్పారు . పవిత్రని ముద్దుగా అమ్ములు అని పిలుస్తానని నరేష్ తెలిపాడు. తనమీద ఇంకా ప్రేమ ఎక్కువైతే అమ్ము అని, ఇంకా ప్రేమ ఎక్కువైతే ఏమని పిలుస్తానో తెలుసా.. అని సస్పెన్స్ పెట్టి వద్దులే అని వదిలేశాడు . అంతే కాకుండా ఇద్దరు కలసి డాన్సులు చేస్తూ స్టేజ్‌పైనే రచ్చ రచ్చ చేశారు.

Naresh: ఎప్పటికీ కలిసి ఉంటాం…


అలాగే అందరూ చూస్తుండగానే ఒకరి మీద ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక వారి రిలేషన్ స్టేటస్ గురించి ఓంకార్ ప్రశ్నించగా.. భూమి బద్దలేనా ఆకాశం కిందపడినా కూడా ఇద్దరూ ఎప్పుడు కలిసే ఉంటామని నరేష్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి నరేష్, పవిత్ర లోకేష్ ఇలా లేట్ వయసులో చాలా ఘాటుగా ప్రేమించుకుంటున్నట్లు అర్థమవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago