Niharika: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో నిహారిక పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అందుకు కారణం ఆమె భర్తకు దూరంగా ఉండటం. జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకున్న నిహారిక గత కొంతకాలంగా అతనితో దూరంగా ఉంటూ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నీహారిక ఏం చేసినా కూడా ఆసక్తికరంగా మారింది.
సోషల్ మీడియాలో నిహారిక షేర్ చేసే ఫోటోలను బట్టి ఆమె జీవితంలో జరిగే సంఘటనల గురించి అంచనాలు వేస్తున్నారు. జొన్నలగడ్డ చైతన్యని వివాహం చేసుకున్న తర్వాత నిహారిక యాక్టింగ్ కి దూరంగా ఉంటూ నిర్మాణరంగం వైపు అడుగులు వేసింది. ఈ క్రమంలో పలు వెబ్ సిరీస్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూనే.. వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇదిలా ఉండగా నిహారిక నటించిన డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ మరో నాలుగు రోజుల్లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం నిహారిక ఇంటర్వ్యూలలో పాల్గొంటు బిజిగా ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల నిహారిక షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో నిహారిక మెడలో తాయత్తు ధరించి ఉండటంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అసలు నిహారిక ఇలా తాయత్తు ధరించటానికి కారణం ఏమిటని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ప్రస్తుతం నీహారిక తన కెరీర్ మీద దృష్టి పెట్టడం వల్ల తన వ్యక్తిగత విషయాల గురించి ఎలాంటి వార్తలు వినిపిస్తున్నప్పటికీ వాటి గురించి స్పందించటం లేదు. ఇక ఇటీవల పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన నిహారిక ఇటీవల కొత్త ఆఫీస్ కూడా ప్రారంభించింది. ఇలా తన భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతో నిహారిక ఒక స్వామీజీ సూచనల ప్రకారం తాయత్తు ధరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలోచించడానికి నిహారిక సిద్ధమైంది. సినిమాలలో హీరోయిన్ గా సరైన సక్సెస్ అందుకోని నిహారిక ఈ వెబ్ సిరీస్ ల వల్ల అయిన నటిగా నిరూపించుకుంటుందో లేదో చూడాలి మరి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…