Movie News

Priyanka singh: అమ్మాయిగా మారాలనుకుంటే ముందు ఆ పని చేయండి.. ప్రియాంక సింగ్ కామెంట్స్ వైరల్!

Priyanka singh: ప్రియాంక సింగ్ పరిచయం అవసరం లేని పేరు. జబర్దస్త్ కార్యక్రమంలో సాయిగా అందరికీ ఎంత సుపరిచితమైనటువంటి ప్రియాంక జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎక్కువగా లేడీ గెటప్స్ వేసేవారు. ఇలా లేడి గెటప్స్ వేసినటువంటి ఈయన అనంతరం సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిపోయి సాయి కాస్త ప్రియాంక సింగ్ గా మారారు.

ఇలా ప్రియాంక సింగ్ గా మారిన తర్వాత ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా సుమారు 12 వారాలు పాటు హౌస్ లో కొనసాగినటువంటి ప్రియాంక సింగ్ బయటకు వచ్చిన తర్వాత కెరియర్ పరంగా సక్సెస్ అందుకోవడం కోసం పెద్ద ఎత్తున కష్టపడుతున్నారు. తాజాగా ఈమె యూట్యూబర్ నిఖిల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూలో భాగంగా తన జీవితం గురించి ఎన్నో విషయాలు తెలిపారు. నాకు చిన్నప్పటినుంచే అమ్మాయి లక్షణాలు తనలో ఎక్కువగా ఉండటంతో తాను అమ్మాయిగా మారిపోయానని తెలిపారు. అయితే అబ్బాయిలు అమ్మాయిగా ఎవరైతే మారిపోవాలనుకుంటున్నారో అలాంటి వారు ముందుగా హార్మోన్ థెరపీ తీసుకోవాలని తెలిపారు. ఇక నేను అమ్మాయిగా మారడంతో ఎంతోమంది ఎన్నో మాటలు అనేవాళ్ళు ఆ మాటలనే ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అన్నారని ప్రియాంక తెలిపారు.

మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించా…

ఇలా ఇంట్లో వాళ్ళే నన్ను అపార్థం చేసుకోవడంతో తాను ఏకంగా మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేశానని కానీ బ్రతకడంతో నేనేదో సాధించాలని అప్పుడే అర్థమైందంటూ ఈమె తెలిపారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో తన గురించి బ్యాడ్ కామెంట్స్ చేసిన వారిపై ఈమె ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి కూడా మాట్లాడుతూ కామెంట్ చేయడానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది కానీ చాలామంది లైన్ క్రాస్ చేసి కామెంట్ చేయడంతోనే తాను సీరియస్ అయ్యానని ప్రియాంక తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago