Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. మెగా డాటర్ గా గుర్తింపు పొందినటువంటి ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి యాంకర్ గాను హీరోయిన్ గాను సందడి చేశారు. అనంతరం పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు అయితే వైవాహిక జీవితంలో ఎక్కువ కాలం పాటు నిహారిక ఉండలేకపోయారు. దీంతో తన భర్తతో విడాకులు తీసుకొని ఈమె విడిపోయారు.
ఇలా తన భర్త నుంచి విడిపోయిన అనంతరం కెరియర్ పై ఎంతో ఫోకస్ పెట్టినటువంటి నిహారిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె మొదటిసారి తన వృత్తి పరమైన వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా తెలియజేశారు. ఈ క్రమంలోనే సిసింద్రీ సినిమా గురించి నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాను 1993లో జన్మించానని తెలిపారు. నాన్నకు ఆడపిల్ల పుట్టాలని చాలా కోరికగా ఉండేది ముందుగా అన్నయ్య పుట్టడంతో ఈసారి తప్పకుండా కూతురే పుడుతుందని భావించారు. అయితే నేను అపోలో హాస్పిటల్లో జన్మించానని నేను జన్మించే సమయానికి నాన్న ముగ్గురు మొనగాళ్లు సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తూ షూటింగ్ లొకేషన్ లో ఉన్నారు. పాప పుట్టిందని తెలియగానే నాన్న పెదనాన్న ఇద్దరు షూటింగ్ లోకేషన్ నుంచి హాస్పిటల్ కి వచ్చారని నిహారిక తెలిపారు.
8 నెలలకే నడిచే దాన్ని..
ఇక నేను పుట్టినప్పటి నుంచి చాలా యాక్టివ్ గా ఉండే దానిని ఎనిమిది నెలలకే నడవడం మొదలుపెట్టాను అయితే సిసింద్రీ సినిమా కోసం పాకుతూ ఉండే చిన్నారి కావాలని నన్ను కూడా సంప్రదించారు కానీ నేను నడుస్తూ ఉండడంతో నా బదులు ఈ సినిమాలో అఖిల్ నటించారంటూ నిహారిక ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…