Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే చిరంజీవి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ఇకపోతే నిన్న చిరంజీవి తల్లి అంజనదేవి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే తన తల్లి పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన తల్లి గారికి ఎమోషనల్ బర్తడే విషెస్ తెలియజేశారు. అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవితో పాటు తన చెల్లెలు తమ్ముడు కూడా ఈ వేడుకలలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు.
కని పెంచిన అమ్మ…
ఇక తన తల్లి పుట్టినరోజు వేడుకలను తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా నిర్వహించారు అందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కనిపించే దేవత కని పెంచిన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఈయన తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చిరంజీవి అభిమానులు కూడా అంజనా దేవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…