Salaar: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ రచయితగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో పరుచూరి గోపాలకృష్ణ ఒకరు ఈయన ఎన్నో సినిమాలకు అద్భుతమైన కథలను అందిస్తూ రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతలను పొందారు. ఇకపోతే పరుచూరి ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్త సినిమాలు విడుదలయితే ఆ సినిమాల గురించి విశ్లేషణ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే.
తాజాగా సలార్ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాహుబలి తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి ప్రభాస్ ఏ సినిమా ద్వారా హిట్ అందుకోలేదు కానీ సలార్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు ఈ సినిమా గురించి పరచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..యాక్షన్, జానపదం, పౌరాణికం, సాంఘిక అంశాలు అన్నీ మేళవించి ప్రశాంత్ సలార్ సినిమా రూపొందించారని వివరించారు.
అయితే సలార్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాకుండా మరి ఏ డైరెక్టర్ అయిన ఈ సినిమాని కనుక చేసి ఉంటే తప్పకుండా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యదని ఆయన కాబట్టి సినిమా హిట్ అయ్యిందని తెలిపారు. ఇక మొదటి 30 నిమిషాల పాటు ప్రభాస్ కి ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం తనని ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు.
స్క్రీన్ ప్లే అద్భుతం..
సినిమాలో కాన్సర్ అనే ప్రాంతాన్ని చరిత్రతో మిక్స్ చేసి చూపించాడు.ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ఎంతో అద్భుతంగా ఉందని యాక్షన్స్ సన్ని వేషాలు కూడా చాలా అద్భుతంగా చూపించారని గోపాలకృష్ణ సలార్ సినిమా పట్ల తన అభిప్రాయాలను తెలియజేశారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అభిమానులు రెండవ భాగం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…