Poonam Kaur: మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు రావడంతో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు అలాగే అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విధంగా చిరంజీవికి భారత ప్రభుత్వం అత్యుత్తమైనటువంటి గౌరవం అందజేయడంతో సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి మరి తనని అభినందిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హారిక హాసిని క్రియేషన్ ప్రొడ్యూసర్ చిట్టిబాబుతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లి చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా చిరంజీవి త్రివిక్రమ్ ఇద్దరూ నవ్వుతూ కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో వైరల్ గా మారింది.
ఈ ఫోటోలలో త్రివిక్రమ్ పూర్తిగా తనలోకి మార్చేశారు. ఎప్పుడు గుబురు గడ్డంతో కనిపించే ఈయన ఈసారి మాత్రం క్లీన్ షేవ్ తో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలపై నటి పూనం కౌర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అసంతృప్తి వ్యక్తం చేసిన పూనమ్..
ఈమె సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు పరోక్షంగా కామెంట్లు చేస్తూ ఉంటారు ఈమె చేసే పోస్ట్ కు అర్థం ఏంటి అనే విషయాలు మాత్రం ఎవరికీ అర్థం కాకుండా ఉంటాయి. అయితే త్రివిక్రమ్ పట్ల తరచూ ఈమె పరోక్షంగా చేసే కామెంట్స్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా చిరంజీవి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫోటో ఫై ఈమె పూర్తిగా అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. వీరిద్దరి ఫోటోని చూస్తుంటే తన గుండె ముక్కలైంది అంటూ బ్రోకెన్ హార్ట్ సింబల్స్ షేర్ చేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…