Sandeep Kishan: ఫుట్ పాత్ ఫుడ్ బిజినెస్ ప్రారంభించి జీవనోపాధిని వెతుక్కున్నటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు. అయితే ఇటీవల కాలంలో ఈమె సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. పెద్ద ఎత్తున జనాలు ఎగబడ్డారు అయితే జనాలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా రావటం గమనార్హం.
ఈ విధంగా కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ఓ రేంజ్ లో పాపులర్ అవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఈమె ఫుడ్ టెస్ట్ చేసేవారు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి ఈమె ఫుడ్ టెస్ట్ చేయడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి రావడంతో భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా పోలీసులు ఈమె బిజినెస్ పట్ల చర్యలు తీసుకున్నారు. ఏకంగా తన బిజినెస్ క్లోజ్ చేయించారు.
ట్రాఫిక్ జామ్ అనేది పేరు మాత్రమేనని ఈమె ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడటంతోనే ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ అయింది అనే వాదన కూడా తెరపైకి వచ్చింది ఏది ఏమైనా జీవనోపాధి కోసం ఫుట్ పాత్ పై ఫుడ్ విక్రయిస్తూ జీవనం గడుపుతున్నటువంటి ఈమె బిజినెస్ క్లోజ్ కావడంతో ప్రముఖ నటుడు సందీప్ కిషన్ ఈమెకు మద్దతుగా నిలిచారు.
ఎందరికోస్ఫూర్తి….
గత కొద్ది రోజుల క్రితం సందీప్ కిషన్ కుమారి ఆంటీ వద్దకు వెళ్లి ఆమె ఫుడ్ టెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ జామ్ అవుతుందన్న కారణంగా ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయడం సరైంది కాదని తెలిపారు. ఎంతోమంది మహిళలకు ఆమె స్పూర్తిగా నిలిచారని సందీప్ కిషన్ కామెంట్లు చేశారు. ఈ మధ్య కాలంలో నేను చూసిన బలమైన సాధికారత మహిళలలో కుమారి ఆంటీ కూడా ఒకరని తెలిపారు. వీలైనంతవరకు నేను నా టీం తో కలిసి తనకు సహాయం చేస్తాను అంటూ ఈ సందర్భంగా సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…