Featured

Anchor Suma: యాంకర్ సుమ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న హీరో.. వీడియో వైరల్?

Anchor Suma: తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. తెలుగులో ఎన్నో షోలకు ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తూ యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది. అంతేకాకుండా బుల్లితెరపై ఉన్న ఫిమేల్ యాంకర్స్ లో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే సుమ అనే విధంగా గొప్ప పేరు సంపాదించుకుంది యాంకర్ సుమ. అయితే మొన్నటి వరకు వరుసగా ఫ్రీ రిలీజ్ వేడుకలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు షోలు అంటూ బిజీగా గడిపిన సుమ ప్రస్తుతం యాంకరింగ్ కు కాస్త దూరంగానే ఉంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా యాంకర్ సుమ చేసిన పనికి ఒక హీరో కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఇంతకీ ఆ హీరో ఎవరు? అసలు ఏం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకున్న సయ్యద్ సోహెల్ గురించి మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా వెబ్ సిరీస్ లు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు సోహెల్. ఇటీవలే మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడంతోపాటు మంచి విజయం అందుకున్నారు. ఇప్పుడు త్వరలో బూట్‌కట్ బాలరాను అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది. దీంతో సోహెల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సోహెల్, మూవీ హీరోయిన్ సుమ అడ్డా షోలో పాల్గొన్నారు. ఈ షోలో సోహెల్ యాంకర్ సుమ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. సోహెల్ సుమ అడ్డా షోలో మాట్లాడుతూ..

మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేనంటూ..

రీసెంట్ గా సుమ అక్క మేనేజర్ కి కాల్ చేశాను నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎక్కువ డబ్బులు ఇవ్వలేను కొంచెం తగ్గించండి అని అడిగాను. సరే అక్కతో మాట్లాడి చెప్తా అన్నాడు. తర్వాత సుమ అక్క నుంచి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి అక్కా నేను అమౌంట్ తక్కువ ఇద్దాం అనుకుంటున్నా. నేనే ప్రొడ్యూసర్, అంత డబ్బులు లేవు, చాలా కష్టపడుతున్నాను అని చెప్పాను. నేను నీ దగ్గర డబ్బులు తీసుకోను, నా కొడుకు సినిమా కూడా చేసాడు. అదంతా నాకు తెలుసు. లైఫ్ లో ఇంత ఎదిగింది ఎందుకు, మీలాంటి వాళ్లకి సపోర్ట్ చేయడానికే అని నాకు ఫ్రీగా చేస్తాను అన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్యూ అక్క నేనెప్పటికీ మర్చిపోలేను అంటూ ఎమోషనల్ అయ్యాడు సోహెల్. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.instagram.com/reel/C2pXhP3p4rK/?utm_source=ig_embed&ig_rid=7593249a-c7ac-41c9-a923-f400b381cbaa

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago